నాడు – నేడు : విదేశీ పెట్టుబడుల్లో ఏపీ అథ:పాతాళం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు – నేడు అనే కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ప్రకారం.. కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు..ఎక్కడికో వెళ్లాల్సిన ఏపీని.. ఎక్కడికో తీసుకెళ్తున్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి వాటిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా చేరాయి. గత ఏడాది అంటే 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు ఏపీకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ. 1798 కోట్లు. ఇది ఈ కాలంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కేవలం 0.45 శాతం మాత్రమే.

అరశాతం పెట్టుబడుల్నీ ఆకర్షించలేకపోతున్న ఏపీ..!

2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు దేశంలోకి 3 లక్షల 96 వేల 171 కోట్ల పెట్టుబడులు విదేశాల నుంచి వచ్చాయి. అందులో ఏపీకి వచ్చినవి రూ. 1798 కోట్లు . ఇది అర శాతం కూడా లేదు. కేవలం 0.45 శాతం మాత్రమే. అదే పొరుగురాష్ట్రం తెలంగాణకు రూ. 9,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. అయితే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..తెలంగాణ కూడా వెనుకబడింది. కానీ ఏపీతో పోలిస్తే ఎంతో ముందు ఉంది. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం ఈ వివరాల్ని ప్రకటించింది. మొత్తం వస్తున్న పెట్టుబడుల్లో 35 శాతం గుజరాత్‌కే వెళ్తున్నాయి. జూలై-సెప్టెంబర్‌లోనే ఆ రాష్ట్రానికి లక్షా పదహారు వేల కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. టాప్‌ ఫైవ్‌లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఝార్ఖండ్ ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు మౌలిక సదుపాయాల్లో ముందు ఉన్నా.. జార్ఖండ్ మాత్రం పట్టుదలతో పెట్టుబడులు సాధిస్తోంది.

నాడు ఎఫ్‌డీఐలకు ఏపీ ప్రధానాకర్షణ..!

2018లో విదేశీ పెట్టుబడులను ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 300 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు 14572 కోట్ల రూపాయల పెట్టుబడులు… సంపాదించింది. చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టారు. అతి పెద్ద ఎఫ్‌డీఐగా పేరు తెచ్చుకున్న కియా వచ్చింది. అలాగే అనేక మల్టినేషనల్ కంపెనీలు.. తమ ప్రాజెక్టుల్ని ఏపీలో పెట్టాయి. ఈ ఒరవడి అలా కొనసాగిల్సింది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు రావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వం రావడంతో.. వాటన్నింటినీ నిలిపివేసింది. ఒప్పందాలన్ని ఎక్కడివక్కడ రద్దు చేయడంతో పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. పెట్టుబడులన్నీ ఆగిపోయాయి. ఫలితంగా.. ఏపీకి ఆదాయ పరంగా.. ఇటు యువతకు ఉద్యోగాల పరంగా తీవ్రమైన నష్టం జరిగింది. అమరావతి ప్రాజెక్టులను నిలిపివేయడం మరింత దెబ్బకొట్టింది.

మొత్తం గుజరాత్‌కు తరలించుకుపోతే దేశంలో అసమానతలు పెరగవా..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వరాష్ట్రం గుజరాత్‌కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి పోతున్నాయి. దేశం సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి పెట్టుబడిదారులను అన్ని రాష్ట్రాల వైపు మళ్లించడమే కేంద్రం పని. కానీ అలా చేయడం లేదు. ఎలాంటిప్రాజెక్టు వచ్చిన కేంద్రం ముందుగా.. గుజరాత్ వైపు చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. దానికి ఆ రాష్ట్రం వైపు పరుగులు పెడుతున్న పరిశ్రమలే నిదర్శనం. అన్ని రాష్ట్రాల్లో కేంద్రాన్ని ఎదిరించలేని నాయకత్వం ఉండటంతో గుజరాత్‌కు ఎదురు లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే దేశంలోఅంతరాలు అంతకంతకూ పెరిగిపోతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close