ఆజాద్ ప్ర‌చారానికి రావాల్సిన అవసరం వ‌చ్చిందా..?

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ గా గులామ్ న‌బీ ఆజాద్ బాధ్య‌త‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితితోపాటు, ఇక్క‌డి నాయ‌కుల‌కు సంబంధించిన పూర్తి అవ‌గాహనా అనుభ‌వం ఆయ‌న ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న కూడా త్వ‌రలో రాష్ట్రంలో ప్ర‌చారానికి రాబోతున్నారు. ఆ పార్టీ స్టార్ కేంపేయిన‌ర్ల‌లో రాహుల్ గాంధీ, సోనియా, మ‌న్మోహ‌న్ సింగ్ ల త‌రువాత ఉన్న‌ది ఆయ‌నే. ఓప‌క్క తెరాస ప్ర‌చారం పెంచుతున్న నేప‌థ్యంలో ఆజాద్ ను వీలైనంత త్వ‌ర‌గా రాష్ట్రానికి ర‌ప్పించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం! ఎందుకంటే, ఆయ‌న రాక అవ‌స‌రం ఇప్పుడు క‌నిపిస్తోంది కాబ‌ట్టి!

సీట్ల పంపకాలు పూర్త‌య్యాక‌.. కాంగ్రెస్ లో అసంతృప్తులు ఏ స్థాయిలో ర‌గులుకున్నాయో తెలిసిందే. టిక్కెట్ ద‌క్కని నేత‌ల్ని ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన బృందం బుజ్జ‌గించినా, ఇంకా స‌రిపోలేద‌నే అభిప్రాయ‌మే పార్టీ వ‌ర్గాల్లో ఉంది. ప్ర‌స్తుతానికి కామ్ గా ఉంటున్నా… ఎన్నిక‌లు జ‌రిగే రోజుకు వ‌చ్చేస‌రికి ఈ అసంతృప్త నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ఆందోళ‌న రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఉంది. అందుకే, మ‌రోసారి ఆజాద్ తో బుజ్జ‌గింపులు చేయించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఎలాగూ ఇక్క‌డి నేత‌ల‌తో ఆయ‌న‌కి మంచి స్నేహం ఉండ‌టం, ఇంకోప‌క్క రాహుల్‌, సోనియాల‌తో ఆయ‌న‌కి సాన్నిహిత్యం ఉండ‌టంతో ఆజాద్ మంత్రాంగం బాగా ప‌నిచేస్తుంద‌ని ఆశిస్తున్నారు.

ఆజాద్ రాక అవ‌స‌రాన్ని స్ప‌ష్టంగా చూపించే మ‌రో కార‌ణం కూడా క‌నిపిస్తోంది. అదేంటంటే… ప్ర‌చారంలో భాగంగా ముస్లిం ఓట‌ర్ల‌ను తెరాస బాగా ఆక‌ర్షిస్తున్నార‌నే భావ‌న ఏర్ప‌డుతోంది. గురువారం నాడు ఓ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ… అసదుద్దీన్ ఒవైసీని బాగా వెన‌కేసుకొచ్చారు. నిర్మ‌ల్ లో ప్ర‌చారం చేయ‌కుండా ఉంటే ఆయ‌న‌కి రూ. 25 ల‌క్ష‌లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేత‌లు ఎర‌జూపార‌నీ, పాతిక కోట్లు ఇచ్చినా ఆయ‌న్ని ఎవ్వరూ కొన‌లేర‌న్నారు కేసీఆర్‌. మ‌జ్లిస్‌, తెరాస మ‌ధ్య స్నేహం ఇంత తీవ్రంగా ఉండ‌టంతో… ఇప్పుడు ఆజాద్ ను రంగంలోకి దించి, ప్ర‌చారం చేయించ‌డం ద్వారా ముస్లిం ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించొచ్చు అనేది కాంగ్రెస్ తాజా వ్యూహంగా తెలుస్తోంది. ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఆజాద్ ప్ర‌సంగాల‌ను ప్ర‌ముఖంగా ఉండేట్టు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close