ఆలూ లేదు చూలూ లేదు.. హీరోయిన్ స‌న్నీలియోన్‌

స‌న్నిలియోన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ముఖ్యంగా స‌న్నీలియోన్ సినిమా అంటే… కుర్రకారు థియేట‌ర్ల ముందు క్యూ క‌ట్టేస్తారు. బాలీవుడ్‌లో స‌న్నీ ఓ ప్రభంజ‌నం. పోర్న్ స్టార్ నుంచి వ్యాంప్ పాత్రల్లోకి మ‌ళ్లి, అట్నుంచి అస‌లు సిస‌లైన హీరోయిన్‌గా రూపాంత‌రం చెందుతోంది. అక్కడి స్టార్ హీరోయిన్లకు స‌వాలు విసురుతోంది. స‌న్నీలియోన్ గురించి తెలియ‌నివాళ్లుండ‌రు. మాస్ జ‌నాల్లో ఆమె పేరు చెబితే చాలు హాట్ బీట్ పెరుగుతుంది. మంచు మ‌నోజ్ కరెంట్ తీగ‌లో ఓ చిన్న పాత్రలో మెరిసింది స‌న్నీ. ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయంటే దానికి స‌న్నీ ఎంట్రీ కూడా ఓ కార‌ణం. అప్పట్నుంచి టాలీవుడ్ లో మ‌రోసారి స‌న్నీలియోన్‌ని దించాల‌ని విశ్వప్రయ‌త్నాలు జ‌రిగాయి. కానీ బాలీవుడ్‌లో స‌న్నీ బిజీగా ఉండ‌డం వ‌ల్ల అవేం వ‌ర్కవుట్ అవ్వ‌లేదు. తాజాగా గుంటూర్ టాకీస్ 2లో స‌న్నీలియోన్ న‌టిస్తోంద‌న్న వార్త వినిపిస్తోంది.

ప్రవీణ్ స‌త్తారు ద‌ర్శక‌త్వం వ‌హించిన గుంటూర్ టాకీస్ బాక్సాఫీసు ద‌గ్గర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించుకొంది. బూతు కంటెంట్ అయినా స‌రే, ఈ సినిమాపై హిట్ ముద్ర ప‌డింది. ఈ సినిమా తీసిన నిర్మాత రాజ్‌కుమార్ స్వ‌యంగా ద‌ర్శక‌త్వ బాధ్యత‌లు వ‌హిస్తూ గుంటూర్ టాకీస్ 2 సెట్స్‌పైకి తీసుకొచ్చారు. గుంటూర్ టాకీస్‌లో న‌టించిన రేష్మి, శ్రద్దాదాస్ ఎవ్వరూ ఈ సినిమాలో లేరు. నిర్మాత‌తో విబేధాలొచ్చి ప్రవీణ్ స‌త్తారు కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. గుంటూర్ టాకీస్ బ్రాండ్ ఇమేజ్‌ని కాపాడుకోవాల‌న్న ప్రయ‌త్నంతో, ఈ టైటిల్‌తో సొమ్ము చేసుకోవాల‌న్న ల‌క్ష్యంతో నిర్మాతే ద‌ర్శకుడిగా మారిపోయాడు. సన్నీలియోన్ ఈ సినిమాలో క‌నిపిస్తోంద‌ని చెప్పడంతో సాధార‌ణంగానే ఈ సినిమాపై అంద‌రి దృష్టీ ప‌డింది. అయితే గుంటూర్ టాకీస్ 2 నిర్మాత‌లెవ‌రూ గానీ, అందుకు సంబంధించిన వ్యక్తులు గానీ.. స‌న్నీలియోన్‌ని సంప్రదించ‌లేద‌ని తెలుస్తోంది. సినిమా అంతా అయిపోయాక ప‌రిస్థితిని బ‌ట్టి స‌న్నీని రంగంలోకి దించాల‌ని. ఆమెతో ఓ పాట‌కైనా ఒప్పించాల‌ని చూస్తోంది చిత్రబృందం. స‌న్నితో సినిమా అంటే ఇప్పట్లో మాట‌లు కాదు. గెస్ట్ అప్పీరియ‌న్స్ కే రూ.50 ల‌క్షలు అడుగుతోంది. పైగా గుంటూర్ టాకీస్ 2లో హేమా హేమీలైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు లేరు. అందుకే స‌న్నీ ఈ సినిమా ఒప్పుకోవ‌డ‌మ క‌ష్టమే అంటున్నారు సినీ జ‌నాలు.

కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం స‌న్నీలియోన్ పేరు వాడుకొన్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యం స‌న్నీకి తెలిస్తే ఎలా స్పందిస్తుందో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close