ఆ గోడౌన్ ఎమ్మెల్యేదే.. గుట్కా మాత్రం ఆయనది కాదు..!

ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఎమ్మెల్యే స్టిక్కర్లతో రూ. కోట్లకు కోట్లు తీసుకెళ్తున్న వాహనాలు పట్టుబడుతూ ఉంటాయి. వాహనాలు మావే కానీ.. స్టిక్కర్లు మాత్రం డ్రైవర్లు పెట్టారని.. వైసీపీ నేతలు చెప్పేస్తూ ఉంటారు. అలాగే.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా అలాంటి వ్యవహారంలోనే దొరికిపోయారు. ఆయనకు చెందిన ఓ గోడౌన్‌లో నిషేధిత గుట్కా తయారీ పరిశ్రమ నడుస్తోంది. చాలా కాలంగా… ఈ వ్యాపారం నడుస్తోంది. సుధాకర్ రెడ్డి అనే ముస్తఫా ప్రధాన అనుచరునికి లీజుకు ఇచ్చినట్లుగా చూపించి.. ఫ్యాక్టరీ నడిపేస్తున్నారు. ఎంత కాలం నుంచి ఇలా దంతా చేస్తున్నారో తెలియదు కానీ.. పోలీసులకు నిన్నే తెలిసినట్లుగా దాడులు చేశారు.

అక్కడ ఉన్న సెటప్ చూసి ఆశ్చర్యపోయారు. రూ. కోటి విలువ చేసే యంత్రాలే ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున గుట్కా తయారీ సామాగ్రి లభించింది. ఆ గోడౌన్‌లో తయారు చేసి.. ఏపీకి మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాలకు కూడా తరలించి విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. గుట్కాల తయారీని వినియోగాన్ని ఇప్పటికే నిషేధించారు. నిషేధం తర్వాత.. రూ. రెండు రూపాయలు ఉండే గుట్కాని రూ. పది రూపాయలకు అమ్ముతూ.. సొమ్ము చేసుకుంటున్నారు. రూ. కోట్లకు కోట్లు ఆదాయం వచ్చే పరిస్థితి ఉండటంతో.. రాజకీయ నేతలు రంగంలోకి దిగిపోయారు.

ముస్తఫాకు గోడౌన్లు ఉండటంతో.. వాటిలో .. ఇలాంటి తయారీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏ రాజకీయ నాయకుడు కూడా.. అన్నీ తన అనుచరుల పేర్ల మీదనే చేస్తారు. తన పేరు మీద ఏమీ చేయరు. అనధికారికంగా మాత్రం.. అది ఆయనదే అని.. అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. చెన్నైలో పట్టుబడ్డ నగదువిషయంలో అయినా… గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా..గోడౌన్ గుట్కా ఫ్యాక్టరీ విషయంలోనూ అయినా అంతే. అధికార పార్టీ కాబట్టి.. అనుచరుల మీద నెట్టేసి.. వారంతా సేఫ్‌గానే ఉంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close