నిహారిక‌… ‘హ్యాపీవెడ్డింగ్’

ఒక మ‌న‌సు సినిమాతో మెరిసింది నిహారిక‌. ఆ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిరాశ ప‌ర‌చ‌డంతో రెండో సినిమా విష‌యంలో ఆచి తూచి అడుగులేసింది. చివ‌రికి యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఓ చిత్రంలో న‌టించ‌డానికి సంత‌కం చేసింది. ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్నారు. సుమంత్ అశ్విన్ క‌థానాయ‌కుడు. ఈ చిత్రానికి ‘హ్య‌పీ వెడ్డింగ్ అనే పేరు ఖ‌రారు చేశారు. స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 4 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో క్రేజి బ్యాన‌ర్ యు వి క్రియోష‌న్స్ బ్యాన‌ర్ తో మేము అసోసియోట్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక లు జంట‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. టొటల్ గా ఈ కాంబినేష‌న్ లో మెట్ట‌మెద‌టిసారిగా తెర‌కెక్కిస్తున్నాము. అక్టోబ‌ర్ 4 నుండి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెలుతుంది. రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com