ఆయనంతే చంద్రబాబుకి తప్ప ఎవ్వరికీ లొంగడు

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఒడిదుడుకులు తప్పేలా లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య ఎవ్వరికీ కొరుకుడు పడేలా కనిపించడం లేదు. పార్టీ సమావేశాలు నిర్వహించినా, పార్టీ తజా స్తితి గతులపై సమీక్షించినా వాటికి తరచుగా డుమ్మా కొడుతున్న ఆర్‌ కృష్ణయ్య అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నడా లేదా స్వతంత్య్ర అభ్యర్థిగా ఉన్నాడా అనే సందేహాలు ప్రజలలో కలిగేలా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈనేపధ్యంలో చంద్రబాబునాయుడు ఆర్‌ కృష్ణయ్యతో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నావనే భావనను ఇతరులకు కలుగజేయడానికా అన్నట్లు ప్రత్యేకంగా తాను పురామాయించి ఆర్‌ కృష్ణయ్యను కూడా ఆహ్వనించి అందరు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒక చోట సమావేశ పరిచి సమావేశం నిర్వహించారు.

ఇంతవరకు బాగానే ఉంది. చంద్రబాబునాయుడు పిలిపిస్తే మాత్రం ఆయన ఇంట్లో జరిగిన సమావేశానికి హజరైన ఆర్‌ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ లెజస్లేటేడ్‌ పార్టీ కార్యాలయంలో కొత్త కార్యాలయం సభా పక్షనేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తే మళ్లీ డుమ్మాకొట్టారు. ఆ సమావేశానికి కేవలం నలుగురు ఎమ్మెల్యేలే హాజరుకావడం విశేషం. రేవంత్‌రెడ్డి, ఆరికపూడి గాంధీ, సండ్ర వెంకటయ్య, మాగంటి గోపీనాధ్‌ మాత్రమే టీడీఎల్పీ సమావేశానికి హాజరుఅయ్యారు. వీరు మాత్రమే స్పీకరు కార్యాలయంలో కలిసి మిగిలిన పది మంది ఎమ్మెల్యేల మీద వేటు వేయాలంటూ ఒక విజ్ఞప్తిని కూడా సమర్పించారు. అదే సమయంలో ఆర్‌ కృష్ణయ్య ఈ సమావేశానికి డుమ్మాకొట్టడాన్ని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపిస్తే బుజ్జగిస్తే ఆ సమావేశానికి మాత్రమే ఆర్‌ కృష్ణయ్య హాజరుఅవుతాడనీ, అంతకు మించి తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో అది తన సోంత పార్టీగా ఎలాంటి భావనతోనూ ఆయన వ్యవహరించడం లేదనీ అందరూ గుర్తిస్థున్నారు.

ఉన్నవాళ్లందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ప్రవేశిస్తుండగా మిగిలిన వారిలో ఆర్‌ కృష్ణయ్యలాంటి కొందరు తెలుగుదేశం పార్టీ తమకు సంబందం లేని పార్టీ అన్నట్లుగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో తెదేప పరిస్థితి మరింత తీసికట్టుగా తయారవుతున్నట్టుగా అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

ఓటేస్తున్నారా ? : క్రిమినల్ ఎప్పుడూ హీరో కాదని గుర్తుంచుకోండి !

" ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదేపెద్ద దొంగ వందలు, వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే.. ఎక్కడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close