హైకోర్టు వార్నింగ్‌లతో ఏపీ ఉన్నతాధికారుల్లో అలజడి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో.. ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రాజధాని తరలింపు విషయంలో… ఇంగ్లిష్ మీడియం విషయంలో.. చట్టాలకు విరుద్ధంగా… ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు .. వ్యవహరిస్తే.. అయ్యే ఖర్చును.. వ్యక్తిగత ఖాతాల నుంచి వసూలు చేస్తామని హైకోర్టు స్పష్టమైన వార్నింగ్‌లు అధికారులకు ఇచ్చింది. దీనికి కారణం… బిల్లు ఆమోదం పొందకపోయినా.. రాజధానిని తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేయడమే. విశాఖలో భవనాలు చూసి.. ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడమే. అసలు ఎలాంటి చట్టబద్ధత లేకుండా.. ఈ తరలింపును.. అడ్డుకోవడానికి హైకోర్టు.. అధికారులను బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించాల్సి వచ్చింది. దీంతో.. ఈ వ్యవహారంలో భాగమవుతున్న అధికారులు ముందు వెనుకాడాల్సి వస్తోంది.

ఇంగ్లిష్ మీడియం అమలు విషయంలోనూ.. ప్రభుత్వం తీరు అంతే ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఎనిమిదో తరగతి వరకు.. పిల్లలకు మాతృభాషలో చదువుకునే హక్కు ఉంది. దాన్ని కాలదన్నేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇంకా చట్ట రూపంలోకి రాలేదు. కానీ.. వచ్చే విద్యా సంవత్సరం కోసం అంటూ.. ఇప్పటికే.. పుస్తకాల ముద్రణ… ఇతర పనుల్ని ప్రారంభించడానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చేశారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి … లాయర్లు తీసుకెళ్లడంతో.. అక్కడా అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరికలు వచ్చాయి. అంతే కాదు.. ఏసీబీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని కూడా.. ఘాటుగా చెప్పడంతో.. అధికారులకు ముందుకు.. వెనక్కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ.. వివాదాస్పదమైనవే. ఉదాహరణకు.. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ వైసీపీ రంగులు వేయడం.. వివాదాస్పదమవుతోంది. దానికి.. ఉన్నతాధికారులు జీవోలు కూడా ఇచ్చారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమన్న సంగతి తెలిసి కూడా.. పాలకులు చెప్పారని.. రూ. వందల కోట్లు పెట్టి వేసేశారు. ఇప్పుడు.. తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందోనని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో కి పాల్పడటం వల్ల పెద్ద ఎత్తున అధికారులు.. జైలు పాలయ్యారు. కేసులు పాలయ్యారు. ఇప్పుడు స్వయంగా జగనే అధికారంలో ఉండటంతో.. ఆయన చేస్తున్న పనులు ఇంకెన్ని ఇబ్బందులు తెచ్చి పెడతాయోనన్న ఆందోళన.. అధికారవర్గాల్లో ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ...

స్టూడియోల‌కు పూర్వ వైభ‌వం

జీవితం ఓ సైకిల్ చ‌క్రం లాంటిది. ఎక్క‌డ మొద‌లెట్టామో తిరిగి అక్క‌డికే వ‌చ్చి ఆగుతాం. సినిమాల ప‌రిస్థితి ఇప్పుడు అలానే మారింది. ఇది వ‌ర‌కూ సినిమా అంటే స్టూడియో వ్య‌వ‌హార‌మే. తొలి స‌న్నివేశం...

విమానాల వాయిదా : తొందరపడినా ప్రభుత్వం సిద్ధం కాలేకపోయిందా..?

దేశమంతా విమనాశ్రయాలు ఓపెన్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. ఒక్క రోజు వాయిదా పడ్డాయి. కారణాలేమైనా కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... లాక్ డౌన్ ఎత్తేసి.. సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని.. లాక్‌డౌన్ 1.0 అయిపోయినప్పుడే...

HOT NEWS

[X] Close
[X] Close