ప్రొ.నాగేశ్వర్: స్టీల్ ప్లాంట్లపై కేంద్రానివి కట్టు కథలేనా..?

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన ముఖ్యమైన హామీ.. బయ్యారం, కడపల్లో స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం. కానీ ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటున్నారు. ఇప్పుడు దీనికో విచిత్ర వాదనను కేంద్రం తెర మీదకు తీసుకొచ్చింది. విబజన చట్టంలో..స్టీల్ ప్లాంట్ పెడతామని లేదు.. కేవలం ఫీజుబులిటి స్టడీ చేస్తామని మాత్రమే చెప్పారు అంటోంది. మేం ఫీజుబులిటి స్టడీ చేశాం. సాధ్యం కాదని రిపోర్ట్ వచ్చిందని కేంద్రం సమర్థించుకుంటోంది. రైల్వేజోన్ విషయంలో కూడా కేంద్రం సరిగ్గా ఇదే వాదన చెప్పింది. విభజన చట్టంలో రైల్వేజోన్ ఇవ్వాలని ఎక్కడా లేదని.. కేవలం సాధ్యాసాధ్యాలు పరిశీలించమని మాత్రమే చెప్పిందని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. ప్రభుత్వ అధికారిక లాంగ్వేజ్ అలాగే ఉంటుంది.. కానీ… రాజకీయ పరంగా ఆలోచించాలి. కానీ కేంద్రం అధికారిక లాంగ్వేజ్‌లో పరిగణనలోకి తీసుకుంటుంది. ఫీజుబులిటి స్టడీ చేస్తామనే చెప్పాం కదా అని వాదిస్తోంది.

చట్టానికి కొత్త అర్థం చెబుతున్నారా..?

ఫీజుబులిటి టు స్టడీ అన్నారు అని ఫీజుబులిటీ కాదు అని తేల్చేశారు అంటే.. భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా పూర్తిగా మోసపూరితంగా అన్వయించుుంటారా…?. ఇది ఫీజుబుల్ కాదని…. అప్పటి అధికారపక్షానికి తెలియదా..? విపక్షానికి తెలియదా..?. ఒక వేళ తెలియదు అనుకుంటే నాలుగేళ్ల తర్వాత ఫీజుబులిటి కాదని ఎందుకు చెబుతున్నారు. నాలుగేళ్ల పాటు ఎందుకు చెప్పలేదు. 2014కు ముందే చట్టం వచ్చింది. ఆ తర్వాత ఒకటి, రెండేళ్లలో …. స్టడీ చేసి… సాధ్యం కాదని చెబితే.. కొంత లాజికల్ గా ఉండేది. కానీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి ఫీజుబులిటి ఉంది. ఎందుకంటే.. గతంలో… గాలి జనార్ధన్ రెడ్డికి.. స్టీల్ ఫ్యాక్టరీ కోసం వైఎస్ వేల ఎకరాలు కేటాయించారు. ఆ భూముల్ని బ్యాంకుల్లో పెట్టుకుని లోన్లు తీసుకున్నారు కూడా. ప్రజలకు ఏమీ తెలియకుండానే వాగ్దానాలు చేస్తారా..? అసలు పార్లమెంట్‌లో చేసే చట్టాలను కూడా తెలియకుండా చేస్తారా..?

విభజన హామీలన్నీ “ఫీజుబులిటీ” కాదా..?

విభజన చట్టంలోని మిగతా హామీలన్నీ అమలు చేసి.. ఒక్క స్టీల్ ప్లాంట్… ఒక్కటే సాధ్యం కాదని చెబితే కొంత నమ్మశక్యంగా ఉండేది. కానీ ఇప్పుడు… రైల్వే జోన్ నుంచి ప్రతి ఒక్క విభజన హామీ విషయంలోనూ… ఇలాగే చెబుతోంది. తెలంగాణకు కూడా… రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి చేస్తామన్నారు. తొలి బడ్జెట్ లో ప్రాధాన్యంతం ఇస్తామన్నారు. కానీ ఇచ్చిందేమీ లేదు. విభజన తర్వాత తెలంగాణ, ఏపీలకో ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామన్నారు. ఏపీకో పోలవరం ఇచ్చారు. కానీ తెలంగాణకు మాత్రం ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. అప్పట్లో మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో సుష్మాస్వరాజ్ పాలమూరు – రంగారెడ్డి పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా చేపడతామన్నారు. కానీ ఇప్పుడు పట్టించుకోలేదు. దీన్ని బట్టి చూస్తే విభజన సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదు. టెక్నికల్ గా సాధ్యం కాలేదా..? లేదా రాజకీయంగా సాధ్యం కాదని నిర్ణయించుకున్నారా..?

ఫీజుబుల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయరు..?

విభజన చట్టం హామీలను అమలు చేయాలంటే…దీన్ని ఎలా ఫీజుబులిటి చేయాలి..? . ఫీజుబులిటి కాదు అని రిపోర్ట్ వస్తే… కేంద్రం.. దాన్ని ఫీజుబుల్ చేసేలా ప్రయత్నాలు చేయాల్సింది. కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఉదాహణకు స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో పెట్టడం సాధ్యం కాదని నివేదిక వస్తే.. పరిస్థితులను మెరుుగుపరిచి ఎలా పెట్టవచ్చో కసరత్తు చేయాలి. బయ్యారంలో… ఉన్న ఐరన్ ఓర్ ఖనిజం… స్టీల్ ఫ్యాక్టరీకి పనికి రాదని చెప్పుకొచ్చారు. కానీ ఇంత తక్కువ క్వాలిటీ ఖనిజంతోనూ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో స్టీల్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రభుత్వం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాల్సింది. పెట్టుబడి ఇబ్బందులు ఉంటే.. వయబులిటి క్యాపిటల్ సమకూర్చి… ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నించాల్సింది. కడప జిల్లాలో అయితే…. కేంద్రానికి కావాల్సిన మొత్తం మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా కేంద్రం చలించలేదు.

స్టీల్ ప్లాంట్ తెస్తామని బీజేపీ నేతలు ఎలా చెబుతున్నారు..?

కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ గా సాధ్యం కాదని చెబుతున్నా కూడా …. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కడప స్టీల్ ప్లాంట్ నేతలు తెచ్చి తీరుతామంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. కానీ అదే విధంగా తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని తెస్తామని చెప్పడం లేదు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం… వయబుల్ చేస్తామన్నట్లు చెప్పుకొస్తున్నారు. అంత చాన్స్ ఉంటే.. తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు చెప్పడం లేదు. ఐరన్ ఓర్ ఉంటేనే స్టీల్ ప్లాంట్ వయబుల్ అవుతుందని చెప్పడం కూడా అబద్దమే. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇప్పటి వరకూ.. ఐరన్ ఓర్ గనులు లేవు. ఐరన్ ఓరేలేని విశాఖ స్టీల్ ప్లాంట్ నడుస్తోంది. మరి గనులు ఉన్న.. కడప, బయ్యారం విషయంలో ఎందుకు వయబులిటి కాదు.

ఇప్పుడు సాధ్యం కాదంటే… ప్రజలు ఒప్పుకోరు..!

ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ వయబులిటీ కాదు అనుకుందాం. స్టీల్ ప్లాంట్ … ఇస్తామని ప్రామిస్ చేశారు. కాబట్టి.. దానికి బదులుగా వయబుల్ అయ్యే ఫ్యాక్టరీని ఇవ్వొచ్చు కదా..?. వెనుకబడిన ప్రాంతాలకు పనికొచ్చేలా… ఓ మంచి ప్రాజెక్ట్‌తో కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రయత్నం చేయవచ్చు కదా. కడప, బయ్యారం స్టీల్ ప్లాంట్లు సాధ్యం కావని నాలుగేళ్ల తర్వాత ప్రజలు ఒప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఈ విషయాన్ని కేంద్రానికి అర్థం అయ్యేలా తెలుగు రాష్ట్రాల ప్రజలు చెబుతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close