హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణచైతన్య సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో ఉండగా కాల్చుకున్నారు. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్లు చేస్తున్నారు . ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది.
ఈ అంశంపై అటు రంగనాథ్.. ఇటు కుటుంబసభ్యులు భిన్నమైన ప్రకటనలు చేయడంతో.. ఈ ఆత్మహత్య వెనుక ఏదో ఉందన్నఅభిప్రాయానికి రావాల్సి వస్తోంది. ఆస్పత్రిలో కృష్ణచైతన్య కుటుంబసభ్యులను పరామర్శించిన రంగనాథ్ .. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ప్రకటించారు. రెండేళ్ల క్రితం బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడ్డారని .. కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేయవద్దని మీడియాకు వివరించారు.
అయితే తర్వాన్ కృష్ణ చైతన్యతండ్రి మాత్రం భిన్నమైన వాదన వినిపించారు. తమకు ఆర్థిక సమస్యలేమీ లేదన్నారు. డ్యూటీలో చేరేందుకే గన్ తెచ్చుకున్నారని అనుకుంటున్నామని అన్నారు. తన కుమారుడికి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ అలవాటు లేదన్నారు. ఏం జరిగిందో పోలీసులే దర్యాప్తు చేయాలన్నారు. అయితే ఈయన హైడ్రాలో పని ఒత్తిడి అని కానీ.. మరొకటి కానీ ఆరోపణలు చేయలేదు. హైడ్రా అధికారులు సహకరిస్తున్నారని అన్నారు.
తన గన్మెన్ ఆత్మహత్యాయత్నం అంటే…మీడియాపై తనపై లేనిపోనివి ప్రచారం చేస్తుందని రంగనాథ్ కంగారుపడినట్లుగా ఉన్నారని.. అందుకే కుటుంబసభ్యులతో మాట్లాడకుండా ప్రకటన చేశారని భావిస్తున్నారు.


