‘కత్తి’కి హీరోయిజం మకిలి అంటిస్తున్నారా?

ఎనిమిదేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఎలా ఉండబోతోంది? కథలు వినడానికే రెండేళ్ళ సమయం కేటాయించారు చిరంజీవి. పూరీ జగన్నాథ్ చెప్పిన కథను ఒకె చేసిన తర్వాత కూడా పరి పరి విధాలుగా ఆలోచించి పూరీకి హ్యాండ్ ఇచ్చారు. చిరంజీవికి ‘ఇంద్ర’ లాంటి సూపర్ హిట్ కథను అందించిన చిన్నికృష్ణ, పరుచూరి బ్రదర్స్, కోనవెంకట్‌లాంటి వాళ్ళందరూ కూడా చిరంజీవి కోసం కథలు రెడీ చేశారు. అవేవీ కూడా చిరంజీవికి నచ్చలేదు. ఫైనల్‌గా తమిళ్‌లో సూపర్ హిట్టయిన మురుగదాస్ కథ ‘కత్తి’కి ఓటేశారు. ‘ఠాగూర్’ సెంటిమెంట్ కూడా ఈ నిర్ణయానికి కారణమైంది. హీరోయిజాన్ని ఓ స్థాయిలో పండించగల వి.వి.వినాయక్‌ని దర్శకుడిగా సెలక్ట్ చేసుకున్నారు.

కత్తి సినిమాను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మారుస్తున్నామంటే చాలా మంది ఆ మార్పులు ‘ఠాగూర్’ స్థాయిలో ఉంటాయని ఊహించారు. కానీ నిన్న చిరంజీవి బర్త్ డే ఫంక్షన్‌లో వి.వి.వినాయక్ చెప్పిన ఓ డైలాగ్‌తో ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ‘పొగరు నా ఒంట్లో ఉంది…హీరోయిజం నా ఇంట్లో ఉంది’….ఈ డైలాగ్ చెప్పగానే శిల్పకళా వేదికలో ఉన్న మెగా వీరాభిమానులందరూ కూడా కేకలేశారు. మెగా హీరోలు కూడా మురిసిపోయారు. చిరంజీవి సినిమా స్థాయిని ఎక్కువ ఊహించుకున్న వాళ్ళు మాత్రం ఉసూరుమన్నారు. అద్బుతమైన సాహిత్య సంపద ఉన్న సాయి మాధవ్ బుర్రాలాంటి రచయితలు ఈ సినిమాకు వర్క్ చేశారని చెప్పారుగానీ, ఫైనల్‌గా చూస్తుంటే వి.వి.వినాయక్, పరుచూరి వారి ఫక్తు మసాలా వంటకంగా ‘ఖైదీ నంబర్ 150’ తయారవుతుందేమోననిపిస్తోంది.

పీక కోస్తా, కంటి చూపుతో చంపేస్తా లాంటి డైలాగులతో ఈ జెనరేషన్ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేయాలని ఆశిస్తే అది కచ్చితంగా అత్యాశే. ఒకప్పుడు తెలుగు సినిమా కథలను నైజాం మార్కెట్ డిసైడ్ చేసేది. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ డిసైడ్ చేస్తోంది. ఈ ఒక్క విషయాన్ని స్టడీ చేస్తే చాలు. ఎలాంటి సినిమాలు తీయాలన్న విషయం వెంటనే అర్థమవుతుంది. బాహుబలి తర్వాత స్థాయి విజయాన్ని సాధించిన ‘శ్రీమంతుడు’ లాంటి మాస్ సినిమాలను ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఊరమాస్ సినిమా అయినా కూడా మిర్చిలా ఉండాలని కోరుకుంటున్నారు. లేకపోతే గబ్బర్‌సింగ్ లాంటి కామెడీ ఎంటర్టైనర్ అయినా ఒకే. వాస్తవానికి వి.వి.వినాయక్ సినిమాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ ఇప్పుడు తీసిన ‘శ్రీమంతుడు’ స్టైల్‌లోనే ‘ఠాగూర్’ సినిమా ఉంటుంది. కత్తి సినిమాను కూడా ఆ స్థాయిలో తీయడానికి అవకాశం ఉంది. ‘ఠాగూర్‌‌లో లాగే కథకు, క్యారెక్టర్‌కి ప్రథమ తాంబూలం ఇచ్చే ప్రయత్నం చేస్తూ మంచి సినిమాను అందిస్తే మాత్రం ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అలా కాకుండా మెగా ఫ్యాన్స్ కోసమని, మాస్ కోసమని చెప్పి వంశ డైలాగులు, స్వోత్కర్షల సోది చెప్పుకుంటే మాత్రం చిరంజీవి, చరణ్‌లు కలిసి నటించిన ‘బ్రూస్ లీ’ స్థాయి రిజల్ట్ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉంటే బెటరేమో.

కేవలం అభిమానులు చూస్తే సినిమా హిట్టయ్యే రోజులు ఎప్పుడో పోయాయి. సినిమా బాగాలేకపోయినా కచ్చితంగా సినిమా చూడాలనుకునే అభిమానుల సంఖ్య కూడా తగ్గిపోయింది. తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సినిమా నచ్చాలి అన్న టార్గెట్‌తో కత్తి కథకు న్యాయం చేసేలా సినిమా ఉంటే మాత్రం కచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది. మంచి కథలు, మంచి సినిమాలు చేస్తేనే కెరీర్ బాగుంటుంది, స్టార్ ఢమ్ నిలబడుతుంది అన్ని విషయం తెలియకే వరుసగా మాస్ కోసమని, అభిమానుల కోసమని ఒకే రకం సినిమాలు చేసి ఇప్పుడేం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. చిరంజీవి ఆలోచనల స్థాయి కూడా పదేళ్ళ కిందటే ఆగిపోయిందో… అప్డేటెడ్‌గా ఉన్నాడో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close