బిగ్ బాస్ జాత‌కం ఎలా ఉంటుందో..?

ఎన్టీఆర్ యాంక‌ర్ అన‌గానే తెలుగునాట బిగ్ బాస్ షోకి పాపులారిటీ మొద‌లైపోయింది. ఈ కార్య‌క్ర‌మం ఎలా ఉంటుందో అంటూ… అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్వాహ‌కులు కూడా ఈ షోని భారీ ఎత్తున తీర్చిదిద్ద‌బోతున్నారు. ఈ ఒక్క షోకి రూ.45 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారంటే, బిగ్ బాస్ స్థాయిని అర్థం చేసుకోవొచ్చు. అయితే… బిగ్ బాస్ నిర్వ‌హ‌ణ అంత తేలికైన విష‌యం కాదు. ఎన్టీఆర్ సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ అయినా… ఈ షోలో పోటీప‌డేవాళ్ల‌కూ కాస్తో కూస్తో ఇమేజ్ ఉండాల్సిందే. బాలీవుడ్‌లో స‌ల్మాన్ షోకీ, త‌మిళ నాట క‌మ‌ల్ షోకీ పోటీ దారుల్లో చాలామంది పాపుల‌ర్ న‌టీన‌టులే ఉన్నారు. తెలుగులో ఆ స్థాయి వాళ్లు ఎవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు. దాంతో ఈ షో ఎలా సాగుతుందా?? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

షోలో డ్రామా పండాల‌న్నా, త‌దుప‌రి ఎపిసోడ్‌పై ఆసక్తి క‌ల‌గాల‌న్నా… వివాదాస్ప‌ద వ్య‌క్తులు షోలో క‌నిపించాల్సిందే. అలాంటి వాళ్లు తెలుగులో దొర‌క‌డం లేద‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఇటీవ‌ల త‌మిళ బిగ్ బాస్ టెలీకాస్ట్ అయ్యింది. ఈ షో చూసి అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు. కార్య‌క్ర‌మంలో కొత్త‌ద‌నం లేద‌ని తేల్చేశారు. క‌మ‌ల్‌హాస‌న్ కూడా ఈ షోని స‌రిగా నిర్వ‌హించ‌లేక‌పోయాడ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌మ‌ల్ లాంటి వాడికే.. సాధ్యం కాలేదంటే ఇక ఎన్టీఆర్ ఏం చేస్తాడో అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఎన్టీఆర్ మంచి న‌టుడే కాదు.. గొప్ప మాట‌కారి కూడా. షోని స‌క్ర‌మంగా నిర్వ‌హించే స‌త్తా ఎన్టీఆర్‌లో ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహాలూ లేవు. కాక‌పోతే.. పోటీదారులెవ‌ర‌న్న‌ది తేలాలి. అప్పుడే ఈ షోకి ఓ మ‌జా వ‌స్తుంది. తెలుగులో ఇటీవ‌ల చిరంజీవి నిర్వ‌హించిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడుకి యావ‌రేజ్ రేటింగులు వ‌చ్చాయి. చిరంజీవి కి ఉన్న చ‌రిష్మా గురించి వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చిరు కే రేటింగులు లేవు… ఎన్టీఆర్ కి వ‌స్తాయా? అనే సందేహాలూ నెల‌కొంటున్నాయి. పైగా ఇది భారీ ప్రాజెక్ట్‌. బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలు తెలుగు నాట మ‌రీ కొత్త‌. ఇన్ని ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య‌.. ఎన్టీఆర్ ఈ షోని ముందుకు ఎలా న‌డిపిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close