ఆ హీరో రెండో పెళ్లి చేసుకుంటున్నాడా?

విడాకుల వ్య‌వ‌హారాలు టాలీవుడ్ లో ఈమ‌ధ్య ఎక్కువ‌గా న‌డిచాయి. నాగ చైత‌న్య – స‌మంత విష‌యంలో అయితే..మీడియాలో ఏదో వార్త హ‌ల్ చేస్తూనే ఉంది.. ఇప్ప‌టికీ. ధ‌నుష్ – ఐశ్వ‌ర్య‌లు విడిపోవ‌డం కూడా షాకింగ్ వార్తే. ఓ స్టార్ హీరో కూతురు కూడా త‌న భ‌ర్త‌తో విడిపోయింద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. వీటి మ‌ధ్య‌.. కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త ఏమిటంటే… ఓ హీరో రెండో పెళ్లి చేసుకుంటున్నాడు.

హీరో ఇంటి నుంచే వ‌చ్చి.. హీరో అయిన అత‌ను, పెళ్లి చేసుకుని, సంసార జీవితంలో ఇమ‌డ‌లేక త‌న భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని మీడియాకు, అభిమానుల‌కూ తెలియ‌జేశాడు కూడా. అదేంటో గానీ కొన్నేళ్లుగా ఆ హీరో కెరీర్ ఏమాత్రం స‌వ్యంగా లేదు. బాగా గ్యాప్ తీసుకుని కొన్ని సినిమాలు ప్లాన్ చేశాడు గానీ వ‌ర్క‌వుట్ కాలేదు. కొన్ని మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఆ హీరో మళ్లీ సినిమాల్ని సీరియ‌స్ గా తీసుకున్నాడ‌ట‌ని టాక్. నిజ జీవితంలో కూడా ఓ అడుగు ముందుకు వేయ‌బోతున్నాడ‌. త‌ను మ‌ళ్లీ పెళ్లికి సిద్ధం అవుతున్నాడ‌ని తెలుస్తోంది. గ‌తంలో పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేసుకున్న త‌ను.. ఈసారి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని, అయితే ఆ వ్య‌వ‌హారం చివ‌రి వ‌ర‌కూ ర‌హ‌స్యంగానే ఉంచాల‌నుకుంటున్నాడ‌ట‌. కెరీర్‌లో కూడా స్థిర‌ప‌డ్డాక‌.. ఈ విష‌యాన్ని చెప్పాల‌ని చూస్తున్నాడ‌ట‌. మ‌రి ఆ శుభ ముహూర్తం ఎప్పుడో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close