శ్రీలంక పేలుళ్ల వెనుక ఐసిస్..! టూరిస్టుల రూపంలో ఆత్మహూతి దాడులు..!

శ్రీలంక మారణహోమం వెనుక ఉన్నది… ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని.. అక్కడి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా.. చర్చిల్లో ప్రార్థనలకు వచ్చిన క్రైస్తవులను టార్గెట్ చేసుకుని… ఉదయం అంతా.. బాబులతో హోరెత్తించారు. మొత్తంగా.. ఓ చర్చిలో.. మరో స్టార్ హోటల్‌లో.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు… ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. వారే ఇతర చోట్ల కూడా బాంబులను అమర్చినట్లు అనుమానిస్తున్నారు. రోజంతా.. మొత్తంగా.. ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పటి వరకూ 190 మంది వరకూ మరణించారు. ఇంకా కొన్ని వందల మంది… పేలుళ్ల ధాటికి గాయపడి… ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు అనుమానితుల్ని.. శ్రీలంక భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. శ్రీలంకపై.. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు.. దాడి చేస్తారని.. ఎవరూ ఊహించలేని విషయం. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఐసిస్.. శ్రీలంకను టార్గెట్ చేసిందని.. ఎవరూ ఊహించలేదు.

అనూహ్యంగా.. దాడులకు పాల్పడ్డారు. 2009లో ఎల్‌టీ‌టీఈని అంతమొందించినప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీలంక ఎన్నడూ ఇంత హింసాత్మక ఘటనను చూడలేదు. అక్కడ తీవ్రవాదం కూడా లేదు. అక్కడ ఉండే సింహాళ, తమిళ వర్గాల మధ్య కూడా.. పెద్దగా గొడవలు లేవు. అయినప్పటికీ.. ఇస్లామిస్ స్టేట్ ఉగ్రవాదులు.. ఆ చిన్న దేశాన్ని అతలాకుతలం చేయడానికి ఎందుకు ప్రయత్నించారన్నది .. ప్రపంచదేశాలకు అంతుబట్టడం లేదు. నిజానికి ఐసిస్ .. ఇటీవలి కాలంలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఐసిస్ చీఫ్ అల్ బగ్దాదీని… హతమార్చినట్లు అమెరికా గతంలో ప్రకటించింది. ఆ తర్వాత సహజంగానే కార్యకలాపాలు తగ్గిపోయాయి. అనూహ్యంగా శ్రీలంకలో మారణహోమం సృష్టించి ప్రకంపనలు రేపింది.

ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఇద్దరూ… టూరిస్టులుగా శ్రీలంకకు వచ్చినట్లుగా అక్కడి ప్రభుత్వం అనుమానిస్తోంది. హైదరాబాద్‌లో రెండు రోజుల కిందట.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన అధికారులు… కొంత మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారు ఐసిస్ భావజాలానికి ఆకర్షితులయ్యారని… గుర్తించి అరెస్ట్ చేశారు. భారత్‌లోనూ.. ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాలు ఎన్‌ఐఏ వ్యక్తం చేస్తోంది. ఈ లోపే శ్రీలంకను టార్గెట్ చేసుకున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి… భారత్ లాంటి దేశాల్లో.. కష్టం కాబట్టి… శ్రీలంకను ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. శ్రీలంక పేలుళ్లలో పలువురు భారతీయులు తృటిలో తప్పించుకున్నారు. నటి రాధిక ఓ స్టార్ హోటల్‌లో బస చేసి ఉన్నారు. ఆమె కూడా పేలుళ్ల నుంచి తప్పించుకున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి.. మరికొందరు టీడీపీ నేతలు బస చేసిన మరో హోటల్ వద్ద కూడా పేలుళ్లు జరిగాయి. వారు కూడా ప్రాణాలు దక్కించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com