రివర్స్ శంకుస్థాపనలు – ఇప్పటి వరకూ చేసినవి కదిలాయా?

చెల్లికి మళ్లీ పెళ్లి అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన వాటికి కొత్త సీఎం జగన్ మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో రామయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. నిజానికి మూడున్నరేళ్ల కిందటే సీఎం శంకుస్థాపన చేశారు. ఆ పనులు కొనసాగించి ఉంటే ఈ పాటికి ఓ రూపు వచ్చేది. కానీ ఆపేశారు. ఇప్పుడు జగన్ శంకుస్థాపన చేస్తున్నారు. కడతారా లేదా అన్నది ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే.. ఈ మూడేళ్ల కాలంలో జగన్ రివర్స్ శంకుస్థాపనలు చేసిన వాటిని కాస్త రివైండ్ చేసుకుంటేక్లారిటీ వచ్చేస్తుంది.

చిన్న చిన్న వాటి గురించి పక్కన పెడితే.. కాస్త పెద్దవాటి గురించి చెప్పుకుందాం. మొదట సీఎం కాగానే చంద్రబాబు శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టేసి.. ప్లేస్ మార్చి తాను శంకుస్థాపన చేశారు. మూడేళ్లు అయింది. ఇప్పటికీ ఆ స్టీల్ ప్లాంట్ గతేంతో తెలియదు. నిజానికి ఏడాదిన్నరలో తొలి విడత పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేశారు. కానీ ఒక్కటీ ముందడుగు పడలేదు. కృష్ణాజిల్లాలో వేదాద్రి ప్రాజెక్టుకు రీ శంకుస్థాపన చేశారు. అదీ కాస్త పని జరిగిన తర్వాత డబ్బులివ్వలేదని కాంట్రాక్టర్ పారిపోయాడు.

అన్నింటి కంటే ముఖ్యం.. సీఎం కాగానే ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం గత ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన ఆస్పత్రికి ఇచ్చాపురంలో మళ్లీ శంకుస్థాపన చేశారు, మూడేళ్లు గడిచినా అది ఇంకా పునాదుల దశలోనే ఉంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్ చూస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సీఎం శంకుస్థాపన చేసిన ఒక్క దానికీ కనీస పనులు జరగలేదు. చివరికి పులివెందుల బస్టాండ్‌కు కూడా ! అయితే ఈ శంకుస్థాపనల పేరుతో సాక్షి మీడియాకు వందల కోట్ల విలువైన ప్రజాధనం మాత్రం దోచి పెట్టారు. రామాయపట్నం విషయంలోనూ అదే జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close