మోడీ నొక్కేసిన బటన్‌ను మళ్లీ జగన్ నొక్కుతున్నారా !?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం కూడా ఓ బటన్ నొక్కబోతున్నారు. ఈ బటన్ నొక్కడం వల్ల రైతుల ఖాతాల్లోకి 48.86 లక్షల మందికి రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు, 1.51 లక్షల మంది కౌలుదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు రూ.2వేల చొప్పున రూ.30.20 కోట్లు జమ చేస్తామని చెబుతున్నారు. ఇందు కోసం ఎప్పుడూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తారు. ఈ సారి హాఫ్ పేజీ ప్రకటనలే ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నొక్కబోయే బటన్‌ను ఇప్పటికే ప్రధాని మోడీ నొక్కేశారు మారి.

జనవరి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం-కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపుగా పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. ఇరవై వేల కోట్లను జమ చేశారు. దీనికి సంబంధించి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశమయ్యారు కూడా. ఒక్కో రైతుకు రూ. రెండు వేల చొప్పున జమ అయ్యాయి. ఏపీలోని రైతులకూ జమ అయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్ నొక్కబోయే మీట కూడా ఆ రెండు వేలకే .. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదు.

రైతు భరోసా పథకం కింద పదమూడున్నర వేలు ఇస్తామన్న ఏపీ ప్రభుత్వం.. అందులో ఆరు వేలు కేంద్రం ఇచ్చే పీఎం – కిసాన్ నిధుల్ని కలిపేసింది. వాస్తవంగా ఏపీ సర్కా‌ర్ ఏడున్నరవేలు ఇస్తుంది. కేంద్రం మూడు విడతలుగా ఇస్తుంది కాబట్టి.. ఏపీ ప్రభుత్వం కూడా మూడు విడతలుగా ఇస్తామని చెప్పింది. మొదటి విడతలో కేంద్రం ఇచ్చే రెండు వేలతో పాటు ఐదున్నరవేలు.. రెండో విడతలో కేంద్రం ఇచ్చే రెండువేలతో పాటు మరో రెండు వేలు కలిపిస్తున్నారు. మూడో విడతలో మాత్రం పూర్తిగా కేంద్రం ఇచ్చే రెండు వేలు మాత్రమే. ఇప్పుడు మూడో విడత కాబట్టి … ఏపీ ఇచ్చేదేమీ లేదు. కానీ జగన్ మీట నొక్కడానికి..పబ్లిసిటీకి మాత్రం ఉపయోగపడుతున్నాయి.

అయితే కేంద్రం కౌలు రైతులకు సాయం చేయడం లేదు. ఏపీ సర్కార్ మాత్రం కౌలు రైతులకు సాయంచేస్తామంటోంది. ఇలాంటి రైతుల్ని ఒకటిన్నర లక్షల మందికి రూ. రెండు వేల చొప్పున జమ చేస్తారు. ఇది మొత్తం రూ. ముఫ్ఫై కోట్లు, అంటే ముఫ్ఫై కోట్లు జమ చేసేదానికి .., హాఫ్ పేజీ ప్రకటనలన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

HOT NEWS

css.php
[X] Close
[X] Close