దేవ్ విష‌యంలో జ‌న‌సైనికుల‌ ‘సెల్ఫీ’గోల్‌!

దేవ్.. జ‌న‌సేన‌లో రాజ‌కీయ చాణ‌క్యుడు కాబోతున్నాడ‌నే బిల్డ‌ప్ తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిచయం చేశారు! ఇంత‌కీ ఎవ‌రీ దేవ్‌, ఏమా క‌థ అనేది ‘తెలుగు 360’ వెలుగులోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఒక సాధార‌ణ గ‌ల్లీ నాయ‌కుడికి తీసుకొచ్చి, ఏకంగా అంత‌ర్జాతీయ స్థాయి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప‌వ‌న్ ప‌రిచ‌యం చేయ‌డం, ఆ త‌రువాత వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డటంతో జ‌న‌సేన వ‌ర్గాలు ఒక్క‌సారి ఖంగుతిన్నాయి. దేవ్ నియామ‌కం, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం జ‌న‌సైనికుల్లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశంపై చ‌ర్చ జరుగుతోంది. చ‌ర్చ అనే కంటే.. జోకులు పేలుతున్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు!

మొన్న‌, వాసుదేవ్ ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌సారిగా ప‌రిచ‌యం చేసేస‌రికి… జ‌న‌సేన వ‌ర్గాల‌న్నీ ఆయ‌న్ని ఒక రేంజిలో ఊహించుకున్నాయి! వాసుదేవ్ ప‌రిచ‌య ఉప‌న్యాసం వినేస‌రికి… ప‌వ‌ర్ ప‌వ‌ర్ కి దేవ్ వ్యూహాలు క‌లుస్తే ర‌చ్చ‌ర‌చ్చే అనేసుకున్నారు. ఈ ఉత్సాహంలో ఊపులో కొంత‌మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దేవ్ తో చ‌క‌చ‌కా సెల్ఫీలు దిగేశారు. సోషల్ మీడియాలో వెంట‌నే డీపీలు మార్చేసుకున్నారు. 175 నియోజ‌క వ‌ర్గాల్లో జనసేన పోటీ గ్యారంటీ అని ప‌వ‌న్ అంటున్నారు క‌దా! ఈ నేప‌థ్యంలో కొంత‌మంది ఆశావ‌హులు కూడా ఇప్ప‌ట్నుంచే దేవ్ తో స‌న్నిహితంగా ఉంటే బాగుంటుందేమో అనుకున్నారు. ముంద‌స్తు ప‌రిచ‌యానికి సాక్ష్యంగా ఉంటుంద‌న్న ఉద్దేశంలో సెల్ఫీలు దిగి సేవ్ చేసుకున్నారు!

అయితే, దేవ్ నేప‌థ్యం గురించి, ఆయ‌న బిల్డ‌ప్ గురించి అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ‌గానే.. సెల్ఫీలు దిగిన జ‌న‌సైనికులు ఖంగుతిన్నారు! ఆ త‌రువాత‌, జోకులు వేసుకోవ‌డం ప్రారంభించార‌ట‌. ‘ఈయ‌న సెలెబ్రిటీ అనుకుని సెల్ఫీలు దిగేస్తే.. ఇదేంటి ఇలా జ‌రిగింద‌’ని సన్నిహితులతో వాపోతున్నారట. తొంద‌ర‌ప‌డి సోష‌ల్ మీడియాలో గొప్ప‌ల‌కుపోయి ఆ సెల్ఫీల‌తో పోస్టులు పెట్టేశామ‌నీ, ఇప్పుడు వాటికి వ‌స్తున్న కామెంట్లు చూసి పోస్టుల‌ను డిలీట్ చేయాల్సి వ‌చ్చింద‌ని జ‌న‌సైనికులు స‌న్నిహితుల‌తో చెప్పుకుంటున్నారు! మొత్తానికి, దేవ్ ఎపిసోడ్ జ‌న‌సేన‌లో ఒక సంచ‌ల‌న‌మే అయింది. అంతలోనే అద్భుతం, ఆ వెంటనే ఆశ్చర్యం కలిగించిన పరిణామం ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close