అప్పులు తీర్చిన జ‌య‌దేవ్‌

టాలీవుడ్‌లో డ‌బ్బులు వెద‌జ‌ల్లుతున్నారు. ఎంత ఖ‌ర్చు పెట్టినా స‌రే, తిరిగి వ‌స్తాయ‌న్న న‌మ్మ‌క‌మే అందుకు కార‌ణం. నిర్మాత త‌న‌యుడే హీరో అయితే ఇక చెప్ప‌క్క‌ర్లెద్దు. బెల్లం కొండ శ్రీ‌నివాస్ తొలి చిత్రం ‘అల్లుడు శీను’కి ఏకంగా రూ.40 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో వార‌సుడు వ‌చ్చాడు. త‌నే.. గంటా ర‌వి. జ‌యంత్ సి.ప‌ర్జానీ ద‌ర్శ‌కుడిగా రూపొందిన‌ ‘జ‌య‌దేవ్‌’ చిత్రంలో.. గంటా ర‌వినే హీరో. ఈ సినిమా పూర్తి ప్యాకేజీ సిస్ట‌మ్‌తో రూపొందింది. జ‌యంత్ చేతిలో రూ.11 కోట్లు పెట్టార‌ట‌… ఈసినిమా తీయ‌డానికి. త‌న పారితోషికం, మేకింగ్‌కి మాత్ర‌మే ఈ రూ.11 కోట్లు. మిగిలిన న‌టీన‌టుల పారితోషికాన్ని నిర్మాతే చెల్లించుకోవాలి. ఆ 11 కోట్ల‌లో సినిమా తీసి పెట్టే బాధ్య‌త జ‌యంత్‌ది. ‘జ‌య‌దేవ్‌’ చూస్తే ఇది ఏ రూ.3 కోట్ల‌లోనో తీసిన సినిమా అనిపిస్తుంది. ఈ సినిమాతో జ‌యంత్ అప్పుల‌న్నీ తిరిపోయిన‌ట్టే… అంటూ టాలీవుడ్‌లో కామెంట్లు చేసుకొంటున్నారంతా. మొత్తానికి జ‌యదేవ్ వ‌ల్ల లాభ‌ప‌డిందెవ‌రైనా ఉంటే.. అది జ‌యంత్ సి.ప‌ర్జానీనే. క‌నీసం ఈ సినిమాకి స‌రైన ప్ర‌మోష‌న్లు కూడా చేసుకోలేక‌పోయింది చిత్ర‌బృందం. ఎంత చేసినా.. జ‌నం రారులే… అని ముందే ఫిక్స‌యిపోయి ఉంటారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమాకి టికెట్లు తెగ‌డం లేదు. క‌నీసం 10 శాతం ఆక్యుపెన్సీ కూడా లేద‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.