దివాకరానికి చాదస్తం ముదిరిపోయిందా..? అలకకు కారణమేంటి..?

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి… తెలుగుదేశంపార్టీని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంపై తాడో పేడో అన్నట్లుగా.. టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి… బీజేపీకి వ్యతిరేకంగా పార్టీల మద్దతును కూడగట్టే పనిలో ఉంటే.. సొంత పార్టీకి అండగా ఉండాల్సిన జేసీ.. చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. కలకలం రేపుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాను హాజరు కాబోవడం లేదని ప్రకటించారు. తన అసంతృప్తిని ఆయన బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ… లోక్‌సభకు హాజరు కాబోనని తేల్చి చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసనుకుంటానంటూ.. అధినేతకు చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా స్టేట్‌మెంట్లిచ్చేశారు.

నిన్న ఉదయం వరకూ బాగానే జేసీ దివాకర్ రెడ్డి.. హఠాత్తుగా అలగడానికి కారణమేమిటనన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఎవరెవరు మాట్లాడాలన్నదానిపై… ఎంపీలు కసరత్తు చేశారని.. అందులో జేసీ దివాకర్‌ రెడ్డిని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే.. ఆయన అలిగారన్న ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినా.. చర్చలో ఆయా పార్టీలకు లభించే సమయం మాత్రం.. పార్టీల బలాబలాల ఆధారంగానే ఉంటుంది. ఎన్ని గంటల చర్చ అన్నదాని ఆధారంగా స్పీకర్ .. సమయం కేటాయిస్తారు. విభజన సమస్యల విషయంలో.. కేంద్రం తీరును.. పూర్తి స్థాయిలో దేశం మొత్తానికి తెలిసేలా చేయాలంటే… హిందీ, ఇంగ్లిష్‌లలో అనర్గళంగా మట్లాడేవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సహజంగానే ఈ విషయంలో సీనియర్ ఎంపీలు వెనుకబడిపోయారు.

తెలుగుదేశం పార్టీ తరపున హిందీలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇంగ్లిష్‌లో గల్లా జయదేవ్ మాట్లాడటానికి అవకాశం ఉంది. మూడో ఎంపీకి కూడా మాట్లాడే అవకాశం రావొచ్చు. ఆ అవకాశం కోసం.. ఇతర ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి సీనియర్‌గా తనకు చాన్స్ వస్తుందని ఆశించినట్లున్నారు. కానీ దివాకర్‌కు మైక్ ఇస్తే.. ఎలాంటి పరిస్థితి వస్తుందో.. అందరికీ తెలుసు కాబట్టి.. ఈ విషయంలో ఆయనను మొదటి రౌండ్‌లోనే పక్కన పెట్టేశారు. అందుకే.. జేసీ .. తనకు హిందీ రాదంటూ… మీడియా ముందు సెటైర్లేశారు. ఓడిపోతామని యుద్ధం చేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.

అలిగి .. ఆగ్రహించి.. అనుకున్నవి చేయించుకోవడం జేసీ దివాకర్ రెడ్డి స్టయిల్. గతంలో తన నియోజకవర్గంలో ఓ చెరువుకు నీరు విడుదల చేయలేదని.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికప్పుడు చంద్రబాబు ఆదేశాలిస్తే కానీ వెనక్కి తగ్గలేదు. ఇలాంటి బెదిరింపుల ఎపిసోడ్లు జేసీ దివాకర్ రెడ్డి చాలా చేశారు. తను అనుకున్నది అయితే.. జేసీ మళ్లీ మూములవుతారు. ఆయన అనుకున్నది.. పార్లమెంట్‌లో స్పీచా…? మరొకటా అన్నది తర్వాత తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close