మీడియా ముందుకు జీవిత‌

కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం తిరిగి తిరిగి… సినిమా వాళ్ల జీవితాల‌నే వీధిలోకి దించుతోంది. అస‌లు విష‌యం మానేసి… వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితాల్ని, నాలుగ్గోడ‌ల మ‌ధ్య సాగే ర‌హ‌స్యాల్ని బ‌జారుకి ఈడుస్తోంది. కాస్టింగ్ కౌచ్‌లో ఓ మ‌హిళా సంఘ నేత‌.. జీవిత‌ని కూడా బ‌య‌ట‌కు లాగింది. రాజ‌శేఖ‌ర్ ద‌గ్గ‌ర‌కు అమ్మాయిల్ని పంపేది జీవిత‌నే అంటూ ఘాటైన విమ‌ర్శ‌లు చేసింది. ఓ టీవీ షో లైవ్‌లోకి వ‌చ్చిన మ‌హిళా సంఘ‌నేత ఉన్న‌ట్టుండి జీవిత‌పై విరుచుకుప‌డింది. త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయంటూ… ఉదంతాల్ని పూస గుచ్చిన‌ట్టు చెప్పింది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ జీవిత స్పందించ‌లేదు. ఇప్పుడు మాత్రం ఓ ప్రెస్‌మీట్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈరోజు సాయింత్రం 5 గంట‌ల‌కు జీవిత ఓ ప్రెస్ మీట్ పెట్ట‌బోతోంది. ఇందులో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది. క‌త్తిమ‌హేష్ సునీత‌పై న‌ష్ట‌ప‌రిహారం దావా వేసిన‌ట్టు ప్ర‌క‌టించాడు క‌దా? సేమ్ అదే సీన్ ఇక్క‌డా రిపీట్ అవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. త‌న న్యాయ‌వాదుల‌తో మాట్లాడిన త‌ర‌వాతే… జీవిత ఈ ప్రెస్ మీట్ పెట్టాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. జీవిత ఏం మాట్లాడినా, ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. హాట్ న్యూసే అవుతుంది. మ‌రి జీవిత స్టెప్ ఏంటో తెలియాలంటే సాయింత్రం వ‌ర‌కూ ఓపిక ప‌ట్టాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close