ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది ఈ ముగ్గురేనట!


“ఎపి స్పెషల్ స్టేటస్ కోసం ఇప్పటికే అకుంఠిత దీక్షతో పోరాడుతున్నాది ముగ్గురే. వీళ్ళు ముగ్గురూ కలిసి ఒక సమగ్రమైన ఉద్యమం నిర్మిస్తే, కలిసి రావడానికి, కదిలి రావడానికి, పోరాడటానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం సిద్ధమే!”.
అంటూ ..దీంతో తో పాటు – జగన్, చలసాని, శివాజీ ల ఫోటోలు పెట్టి పోస్ట్ చేసాడు కత్తి మహేష్.

ప్రత్యేక హోదా కి సంబంధించిన డిబేట్ ల లో టివి ఛానెళ్ళలో ధాటిగా మాట్లాడే చలసాని ఆంధ్రులకి సుపరిచితుడే. అలాగే నటుడు శివాజీ గత నాలుగేళ్ళుగా సామాజిక సమస్యలపై స్పందిస్తూ ఉన్నాడు. పాలెం బస్సు దుర్ఘటన సమయం లోనూ, ఆ తర్వాత ప్రత్యేక హోదా కి సంబంధించిన దీక్ష లోనూ తన గొంతుక వినిపించాడు. గతం లో నటుడు శివాజీ, చలసాని జగన్ ని, జగన్ దీక్షలని తేలిగ్గా తీసిపడేసేవారు. ఇక శివాజీ అయితే పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే పది రోజుల్లో ప్రత్యేక హోదా వస్తుందని పవన్ మీద అభిమానాన్ని – కత్తి మహేష్ భాషలో చెప్పాలంటే” భక్తి” ని ప్రదర్శించాడు. చలసాని కూడా డిబేట్స్ లో బిజెపి ని తెగుడుతూ టిడిపి మీద “సున్నితం” అనే స్థాయి కి దాటకుండా మాత్రమే విమర్శలు చేసిన వ్యక్తి. మరి కత్తి మహేష్ కి ఇవన్నీ తెలిసే ఈ పోస్ట్ చేసాడా లేక జగన్ మీద తనకి ఉన్న అభిమానం తో వీళ్ళు జగన్ తో కలిస్తే బాగుంటుందని కత్తి మహేష్ కి అనిపించిందో, లేక నిజంగా చలసాని, శివాజీలు జగన్ గూటికి చేరనున్నారా అనేది తెలీడం లేదు. ఏది ఏమైనా చలసాని, నటుడు శివాజీ జగన్ గూటికి చేరనున్నారా అనే డౌట్ వచ్చింది రాజకీయ వర్గాల్లో

అయితే ఎపి కి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం -చంద్రబాబు “గట్టిగా” మోడి ని అడగకపోవడమే అని చెప్పే జగన్ – మోడీ మీద ఏ స్థాయి పోరాటం చేయగలడో అన్నది ప్రజల సందేహం. ఈ సందేహాన్ని నివృత్తి చేసినపుడే జగన్ పోరాడగలడన్న నమ్మకం ప్రజలకి కలుగుతుంది. మోడీ మీద పన్నెత్తు మాట అనకుండా, “ప్రత్యేక హోదా ఇవ్వండి మోడీజీ” అని కనీసం అభ్యర్థనా పూర్వకంగా కూడా అడగడానికి ఇష్టపడకుండా జగన్ ఏ తరహా ప్రత్యేక హోదా పొరాటం చేయగలడో, ఏ ఉద్యమం నిర్మించగలడో చూడాలని తెలుగు ప్రజలకి కూడా ఆసక్తిగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.