కేసీఆర్ పొలిటికల్ “క్లౌడ్ బరస్ట్‌” !

తెలంగాణలో వరదలకు క్లౌడ్ బరస్ట్ కుట్ర ఉండొచ్చంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ప్రారంభమైంది. వరదలు.. వరద బాధిత సమస్యలు.. కాళేశ్వరం ముంపు వంటి అంశాలు వెనక్కి పోయాయి. అసలు కుట్రపూరితంగా ఇలా వర్షాలు.. వరదలు కురిపించవచ్చా అని ప్రతి ఒక్కరూ చర్చించకోవడం ప్రారంభించారు. విపక్ష నేతలు కేసీఆర్ ప్లాన్ ప్రకారమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. అయితే రకరకాల కామెంట్లతో వారూ చర్చలోకి వస్తున్నారు.

పది కిలోమీటర్ల లోపు ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇది ప్రకృతి సహజంగా జరుగుతుంది. అయితే కేసీఆర్ విదేశీ కుట్ర అంటున్నారు. ఇటీవల చైనా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాలను కృత్రిమంగా సృష్టించగలిగే.. టెక్నాలజీ చైనా దగ్గర ఉందని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో చైనా తన శత్రు దేశాల్లో కృత్రిమంగా ప్రకృతి విపత్తులు సృష్టిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ చెప్పినటలుగా జమ్ముకశ్మీర్, లెహ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ లలో చోటు చేసుకుంటున్న క్లౌడ్ బరస్ట్‌లు చైనా పనేనని చెబుతున్నారు. ఇప్పుడు గోదావరిలోనూ క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర జరుగుతోందన్న కేసీఆర్ వ్యాఖ్యలతో ఈ అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి. చైనా ఇలాంటి కుట్రలు చేసినా అది సరిహద్దులకే పరిమితం కానీ ఇంత లోపలకు వచ్చి చేయలేదని చెబుతున్నారు. అత్యధికులు ఈ విషయాలను నమ్మరు కానీ.. కేసీఆర్ అన్న మాటలపై మాత్రం విస్తృతమైన చర్చ జరుగుతోంది. నిజానిజాలేంటో ఎప్పటికీ తెలియకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close