ఎన్నికలకు ముందు ఉద్యోగులకు కేసీఆర్ వరాల గిలిగింతలు..!

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లారు. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బయటకు వచ్చారు. వెంటనే సచివాలయం వద్దకు వెళ్లి టపాసులు కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. ఎందుకు అంటే… కేసీఆర్ తమకు ఇరవై తొమ్మిది శాతం ఫిట్ మెంట్ ఇస్తామన్నారని…పీఆర్సీ నివేదిక లో సిఫార్సు చేసినట్లుగా ఏడు శాతం కాదని.. పొరుగు రాష్ట్రాలు అంటే ఏపీకన్నా ఎక్కువే ఇస్తామని చెప్పారని వారు ప్రకటించుకున్నారు. అదొక్కటే కాదు.. పదవీ విరమణ వయసు పెంపు సహా… ఉద్యోగులప్రయోజనాలన్నింటినీ కేసీఆర్ నెరవేరుస్తామన్నారని అందుకే.. అధి సాధించిన ఆనందంలో తాము స్వీట్లు పంచుకుంటున్నామని చెప్పారు. వారి ఆనందం చూసి.. ఇతరులు పాపం అల్ప సంతోషులు అనుకునే పరిస్థితి.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే పీఆర్సీ రిపోర్ట్ ప్రభుత్వానికి అందింది. ఆ రిపోర్ట్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలంటూ ప్రభుత్వం కాలయాపన చేసింది. అందులో ఏడు శాతమే పీఆర్సీ ఉండటంతో ఉద్యోగులు ఉసూరుమన్నారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లోనూ.. సీఎస్ సోమేష్ కుమార్.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదుకాబట్టి ఈ సారి సర్దుకుపోవాలని.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఉద్యోగ సంఘాల నేతల నుంచి మంత్రులుగా ఎదిగిన శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్లు.. కేసీఆర్ అంటే.. ఆషామాషీ కాదని ఎక్కువే ప్రకటిస్తారని భరోసా ఇస్తూ వస్తున్నారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ కేసీఆర్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఉద్యోగసంఘాల నేతలకు ప్రగతి భవన్‌కు ఆహ్వానిస్తే.. ఇదే మహాదానందం అని వెళ్లారు.

ఎన్నికలకు చాలా ముందుగానే యాభై వేల ఉద్యోగాల భర్తీ అని…కేసీఆర్ నిరుద్యోగులకు గిలిగింతలు పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే… యాభై వేల ఉద్యోగాల భర్తీ అని కేటీఆర్ ప్రకటిస్తున్నారు. ఆయన ప్రకటనలు ఎన్నికల జిమ్మిక్కులని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలకు ఇంటికి పిలిచి కేసీఆర్ గిలిగింతలు పెట్టారు. దానికి వారు సంబరాలు చేసుకున్నారు.కానీ ఇతర ఉద్యోగులు మాత్రం ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇలా ఎన్నికలకు ముందు.. పిలిచి హడావుడి చేయరని.. గతంలోనే ఇచ్చి ఉండేవారని అనుకుంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం కేసీఆర్ పాత కాలం రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు అందర్నీ సంతోషపెట్టేందుకు పనులు చేయడం వల్ల.. ఎన్నికలకు ముందు మాత్రమే పట్టించుకుంటారని.. తర్వాత పట్టించుకోరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ నేతలకు వాళ్ల ఒత్తిళ్లు వారికి ఉంటాయి కాబట్టి..సంబరాలు చేసుకుంటారు. కానీ వారిలోనూ అనుమానమేఘాలు అలాగే ఏర్పడి ఉంటాయి. కానీ బయట పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పటికైతే… సీఎం కేసీఆర్ పెట్టిన చక్కిలిగింతలకు నవ్వుకోవాల్సిందే. వేరేవారు నవ్వినా ఉద్యోగ సంఘ నేతలకు తప్పదు మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close