కేసీఆర్ నోట రేవంత్ సీఎం మాట !

భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఎప్పుడూ రేవంత్ రెడ్డి అనే మాటను తన నోటి వెంట రానిచ్చేవారు కాదు. తాను స్పందిస్తే.. రేవంత్ మరింతపెద్ద లీడర్ అవుతాడని ..బాల్క సుమన్ లాంటి నేతలతో కౌంటర్ ఇప్పించేవారు. ఎన్నికలకు ముందు వరకూ అంతే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతారా లేదా అన్నదానిపైనా మాట్లాడుతున్నారు. కొడంగల్ లో బహిరంగసభ పెట్టిన కేసీఆర్ రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్న ప్రచారాన్ని నమ్మవద్దని అక్కడి ప్రజల్ని కోరారు. ఫేక్ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కు ఇరవై సీట్ల కంటే ఎక్కువ రావన్నారు.

ఈ మాటలతో పాటు రేవంత్ ను ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ లాంటి విమర్శలు చాలా చే్శారు కానీ.. రేవంత్ సీఎం రేసులో ఉన్నట్లుగా ఒప్పుకున్న ఆయన తీరు కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చినట్లయింది. ఇలా కొడంగల్ లో వ్యాఖ్యలు చేశారని తెలియగానే.. వెంటనే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వ్యూహాత్మకంగా తాను సీఎం అవుతానని చెప్పలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీకి ఎనభైసీట్ల వస్తాయని.. డిసెంబర్ మూడో తేదీన లెక్క పెట్టుకోవాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. కాంగ్రెస్ కు ఎనభై సీట్లు తగ్గిస్తే నువ్ వేసే శిక్షకు తాను సిద్ధంగా ఉంటానని కేసీఆర్ కు ప్రతి సవాల్ చేశారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డిని విమర్శించక తప్పని పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ లో ఆయన ప్రాధాన్యత సీఎం అభ్యర్థిగా ఫ్రంట్ రన్నరగా ఉండాలని గుర్తించాల్సిందేనని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. విమర్శలు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి అప్పటికే వినాల్సిన విమర్శలు.. పడాల్సిన నిందలు.. వెళ్లాల్సిన జైళ్లు అన్నీపూర్తయిపోయాయి.

ఇప్పుడు రేవంత్ రెడ్డి దేనికైనా తెగించి ఉన్నారు. తాను ఇక తెలంగాణ ప్రజలకు అంకితమని.. ఆయన ప్రజలకు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందన్నట్లుగా.. కాంగ్రెస్ కు ఓటు వేయవేద్దని చెప్పడానికే సభలు పెడుతున్న కేసీఆర్.. చివరికి కొడంగల్ ప్రజలకు రేవంత్ సీఎం అవరని చెప్పారు. కానీ కేసీఆర్ మాటలు అక్కడి ప్రజలకు వేరేలా అర్థమయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close