ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి ఆఖ‌రి సినిమా ఇదే!

తెలుగు ప‌రిశ్రమ‌లో విన‌సొంపైన బాణీల‌కు ప్రసిద్ద ఎం.ఎం.కీర‌వాణి. ఎం.ఎంలో ఒక ఎం.. ‘మ‌ధురం’ మ‌రో ఎం.. ‘మెలోడీ’ అంటుంటారు ఆయ‌న అభిమానులు. తెలుగు సినిమాలో తెలుగు పాట‌లోని తెలుగు ప‌దం చెవుల‌కు విన‌సొంపుగా సోకుతోందంటే.. అందులో కీర‌వాణి పుణ్యం కూడా ఉంది. తెలుగు పాట‌కు ప‌ట్టం క‌ట్టి, ఎన్నొ అద్భుత‌మైన బాణీలు అందించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. మాస్ పాట‌లు, క్లాస్ గీతాలు, ఆధ్యాత్మిక గీతిక‌లు ఇలా అన్నిర‌కాల పాట‌లూ అందించారు కీర‌వాణి. ఆయ‌న‌ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలున్నాయి. ప్రస్తుతం బాహుబ‌లి 2, ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాల‌తో బిజీగా ఉన్నారాయ‌న‌. అయితే.. త్వర‌లోనే కీర‌వాణి అస్త్ర స‌న్యాసం చేయ‌బోతున్నారు. ”నేను త్వర‌లో.. రిటైర్‌మెంట్ తీసుకొంటున్నా” అంటూ గ‌తంలోనే సంకేతాలు ఇచ్చారు కీర‌వాణి. అయితే ఇప్పుడు అందుకు మూహూర్తం కూడా కుదిరింద‌ని తెలుస్తోంది.

2016 డిసెంబ‌రు నాటికి చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి కెరీర్‌ని ముగించాల‌నుకొంటున్నార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం బాహుబ‌లి 2కి సంబంధించిన ఆర్.ఆర్ ప‌నులు సాగుతున్నాయి. 2016 చివ‌రిక‌ల్లా ఆయా ప‌నులు ఓ ముగింపు ద‌శ‌కు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. ఓం న‌మో వేంక‌టేశాయ వ‌ర్క్ కూడా డిసెంబ‌రు నాటికి పూర్తవుతుంది. త‌న చివ‌రి ప‌నిదినం ‘ఓం న‌మో వేంక‌టేశాయ‌’తో ముగించాల‌ని కీర‌వాణి నిర్ణయం తీసుకొన్నట్టు ఆయ‌న సన్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. అంటే 2017 నుంచీ కీర‌వాణి కొత్త జీవితం మొద‌లెట్టనున్నార‌న్నమాట‌. న‌వ‌త‌రం సంగీత ద‌ర్శకులు త‌మ జోరు చూపిస్తున్న త‌రుణ‌మిది. వాళ్లకు అవ‌కాశం ఇస్తూ కీర‌వాణి ఈ పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని, త‌న వ్యక్తిగ‌త జీవితాన్ని ఆయ‌న అభిరుచుల‌కు అనుగుణంగా సాగించాల‌ని కీర‌వాణి సినిమాల‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. రాఘ‌వేంద్రరావు, రాజ‌మౌళి చిత్రాలంటే కీర‌వాణి సంగీతం ఉండాల్సిందే. ఇప్పుడు వాళ్లిద్దరూ ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close