ఖమ్మం రివ్యూ : అభ్యర్థుల ప్రకటన తర్వాత మారిన రాజకీయం..!

సంచలన రాజకీయాలకు కేంద్రమైన ఖమ్మంలో సరికొత్త రాజకీయం ప్రారంభమైంది. అందరి అంచనాలను అనుమానాలను తల్లకిందులు చేస్తూ మహాకూమటమి భాగస్వామ్య పక్షాల నాయకులు ఒక్క రోజుకే ఒకే పార్టీ అన్నంతగా కలసిపోయారు. మహాకూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఖమ్మం బరిలో దిగారు. ఖమ్మం అసెంబ్లీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత ఆయన మంగళవారం తొలిసారిగా ఖమ్మం వచ్చారు. నామా నాగేశ్వరరావుకు టీడీపీతో పాటు మహాకూటమి భాగస్వామ్య పక్షాలు ఘనస్వాగతం పలికాయి. కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణా జనసమితి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నామాకు స్వాగతం పలికారు. నామా రాక సందర్బంగా టిడిపి శ్రేణులు నిర్వహించిన ర్యాలీతో ఖమ్మం పట్టణంలో సందడి నెలకొంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు నామా ర్యాలీ కొనసాగింది. ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నాయి.

ఖమ్మం సీటు కోసం మహాకూటమి భాగస్వామ్య పక్షాలన్నీ చివరి క్షణం వరకూ పోరాడాయి. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, వద్దిరాజు రవిచంద్ర, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ సీటు కోసం చివరి క్షణం వరకూ పట్టుబట్టారు. ఖమ్మం సీటు కాంగ్రెస్ సిట్టింగ్ సీటని తమ సీటును తమకే కేటాయించాలని కాంగ్రెస్ నేతలు ఢీల్లీ స్ధాయిలో పైరవీలు చేశారు. ఇటు టిడిపి కూడా ఖమ్మం సీటు కోసం గట్టిపట్టుబట్టింది. ఖమ్మంలో టిడిపికి బలముందని, టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ కు నామా నాగేశ్వరరావు ధీటైన అభ్యర్ధి అని టిడిపి కూటమి భాగస్వామ్యపక్షాల పై వత్తిడి తీసుకువచ్చారు. నిజానికి నామా నాగేశ్వరరావుకు.. పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఉంది . కార్యకర్తల ఒత్తిడితో నామా నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. దీంతో మహాకూటమి ఖమ్మం సీటును టిడిపి కేటాయించకతప్పలేదు.

ఈ పరిస్దితి ఒక్క ఖమ్మంలోనే కాదు మధిరలో సైతం మహాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో నిలచిన మల్లు భట్టివిక్రమాక్కకు సైతం అక్కడి టిడిపి శ్రేణులు మద్దతు పలుకుతున్నాయి. ఇటీవల బట్టి విక్రమార్క బోనకల్ లో నిర్వహించిన సభకు టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. మహాకూటమి ఏర్పడితే….మహా కూటమి నుంచి అభ్యర్దులు బరిలో దిగితే…..గ్రామాలలో పరిస్దితి ఎలా ఉంటుంది..? నాయకులు , కార్యకర్తలు విభేదాలు మరచి పని చేస్తారా…? అభ్యర్దుల గెలుపుకు కృషి చేస్తారా …ముఖ్యంగా ఇంతకాలం శత్రువులగా ఉన్న టిడిపి, కాంగ్రెస్ కార్యకర్తలు కలసి పని చేస్తారా..? అన్న సందేహాలకు సమాధానంగా ఖమ్మం టిడిపి, కాంగ్రెస్ పార్టీల తోపాటు కూటమి భాగస్వామ్యపక్షాలు దోస్త్ మేరా దోస్త్ అంటూ కొత్త రాగం ఆలపిస్తున్నాయి. మహాకూటమికి పూర్తి సానుకూల పరిస్థితిని ఖమ్మంలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close