కేబినెట్ నిర్ణయాలపై ఎల్వీ విమర్శలు..! వైసీపీ అంత భరోసా ఇచ్చిందా..?

ysrcp
ysrcp

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ… ప్రతిపక్ష వైసీపీ కి సహకరించేందుకు.. సర్వీస్ రూల్స్‌కు అతిక్రమిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎల్వీ సుబ్రహ్మాణ్యం సీఎస్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం.. వైసీపీకి అందుతోంది. ఆ సమాచారం ఆధారంగా.. సాక్షి పత్రికలో వరుసగా కథనాలు రాస్తున్నారు. తాజాగా.. ప్రభుత్వం రూ. మూడు వేలకోట్లు.. అధిక వడ్డీకి అప్పు చేసిందంటూ.. ఎల్వీ సుబ్రహ్మణ్యం… ఆర్థిక శాఖ అధికారులను ప్రశ్నించినట్లు… సాక్షిపత్రికలో రావడం కలకలం రేపుతోంది. ఎందుకంటే.. మంత్రివర్గం అప్పు నిర్ణయం తీసుకుంది. నిజానికి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై.. ఎలాంటి కామెంట్లు చేసినా…అది సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకం అవుతుంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇదే మాట చెప్పి.. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మండిపడ్డారు.

నిధుల సమీకరణ, విడుదలలో కేబినెట్‌ నిర్ణయమే ఫైనల్ అని, కేబినెట్‌ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఎస్‌కు లేదన్నారు. అప్పులు, వడ్డీరేట్లపై సీఎస్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని యనమల వ్యాఖ్యానించారు. సీఎస్‌ సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారన్నారని విమర్శించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తూండటం … ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు నిధులు అందకుండా చేస్తూండటంతో.. ఆర్ధికశాఖ సెక్రటరీ సెలవు మీద వెళ్లిపోయారు. దీనిపై ప్రభుత్వ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ చీఫ్ సెక్రటరీగా.. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. సహజంగా.. ఎన్నికల విధులకు సంబంధించిన బదిలీలు మాత్రమే చేయడానికి ఎన్నికల కమిషన్‌కు అధికారం ఉంటుంది. కానీ పోలింగ్‌ కు నాలుగైదు రోజుల ముందు… సీఎస్‌ను బదిలీ చేసి.. ప్రభుత్వం మొత్తాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేతుల్లో పెట్టడం.. ఆయన ప్రతిపక్ష వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూండటంతో… ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఇప్పటికే సీఎస్.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన .. సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి.. ప్రభుత్వానికి కాకుండా.. ప్రతిపక్షానికి జవాబుదారీగా అన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో… మధ్యలో ఉన్న అధికారులు కూడా.. భయపడుతున్నారు. ఎల్వీ సుబ్రహ్మాణ్యం నిర్ణయాలతో తామెక్కడ ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో.. చాలా మంది తప్పించు తిరుగుతున్నారు. అయితే.. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని.. తాను సీఎస్‌గా కొనసాగుతానని… చెప్పి.. కొంత మంది అధికారులను సీఎస్ .. తన వైపునకు తిప్పుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న అభిప్రాయాలు.. ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మరో నెల రోజుల పాటు.. సీఎస్ ప్రతిపక్షంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com