మహర్షి టీజర్… పర్ఫెక్ట్ ఉగాది ట్రీట్

ఉగాది రోజున మహేష్ బాబు నుంచి అభిమానులకు ఓ కానుక వచ్చేసింది. ఈ రోజు సరిగ్గా 9 గంటల 9 నిమిషాలకు మహర్షి టీజర్ ని… బయటకి వదిలింది చిత్ర బృందం. మహేష్ స్టైలిష్ గా… మరింత ఆందంగా కనిపించిన టీజర్ ఇది. మహర్షి ఆశయాన్ని, జీవన విధానాన్ని ఒక్క డైలాగ్ లోనే ఆవిష్కరించే ప్రయత్నం కూడా చేశారు. ఒక నిమిషం నిడివి వున్న ఈ ప్రచార చిత్రం లో.. తొలి పది సెకన్లు మహేష్ స్టైల్ ని రంగరించేశారు.

సక్సెస్ లి ఫుల్ స్టాపులు వుండవు.. కామాలు మాత్రమే ఉంటాయి, సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినీ.. ఇట్స్ ఏ జర్నీ… అనేది రిషి కుమార్ చెప్పే మాట. నాకో ప్రాబ్లెమ్ వుంది సార్.. ఎవడైనా నువ్వు ఓడిపోతావ్ అంటే.. గెలిచి చూపించడం నాకు అలవాటు…

.. ఇది రిషి ఆటిట్యూడ్. మహర్షి కధ మొత్తం ఈ రెండు డైలాగుల మీదే బేస్ అయ్యింది. మహేష్ తప్ప మరో ఆర్టిస్ట్ ఈ టీజర్ లో కనిపించడు. ఆఖరికి అల్లరోడికి కూడా ఛాన్స్ దక్కలేదు. మహేష్ లుక్, డైలాగ్ డెలివరీ అన్ని కొత్తగానేఅనిపించాయి. ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి చేసిన సినిమా ఇది. నిర్మాణ విలువలు కూడా ఆ రేంజ్ లోనే వున్నాయి. ఇక వరుస వైఫల్యాలకు మహేష్ కామా పెట్టి.. తన పూర్వపు ఫామ్ లోకి వెళ్లిపోవడమే తరువాయి అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.