మ‌హేష్ – వంశీపైడిప‌ల్లి సినిమా ఎప్పుడంటే…

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్ని తీయ‌డంలో త‌న‌కంటూ ఓ పంథా సృష్టించుకొన్నాడు వంశీపైడిప‌ల్లి. మున్నా, బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి.. ఇలా త‌న కెరీర్ రికార్డ్ బాగానే ఉంది. అఖిల్‌తో ఓ సినిమా చేద్దామ‌ని కొన్ని నెల‌లుగా త‌న‌తో ట్రావెల్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు తుస్సుమంది. ఆ నిరుత్సాహంలో ఉన్న వంశీకి ఊహించ‌ని ఓ బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు టాక్‌. మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయాల‌ని వంశీ ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నాడు. ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఓకే అయిపోయింద‌ట‌. వంశీ చెప్పిన లైన్ మ‌హేష్‌కి బాగా న‌చ్చింద‌ని, దాన్ని డెవ‌లెప్ చేయ‌మ‌ని మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని టాక్‌. అయితే మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఆ సినిమా పూర్త‌య్యేట‌ప్ప‌టికి యేడాది ప‌ట్టొచ్చు. ఆ త‌ర‌వాత కూడా మ‌హేష్ తో సినిమాలు చేయ‌డానికి చాలామంది ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. వంశీ వంతు వ‌చ్చే స‌రికి క‌నీసం మూడేళ్ల‌యినా ప‌డుతుంది. అయితే వంశీ మాత్రం ”మ‌హేష్ తో ఓ సినిమా చేయ‌డం ఖాయం. ఆ ఆనందంతో మూడేళ్ల‌యినా ఎదురుచూస్తా” అంటున్నాడు. సో.. ఇండ్ర‌స్ట్రీలో మ‌రో కొత్త కాంబినేష‌న్ సెట్ట‌యిపోయింద‌న్న‌మాట‌. ముహూర్తం ఎప్పుడ‌న్న‌ది మ‌హేష్ నిర్ణ‌యించాలి. ఈలోగా ఓ స్టార్ హీరో కోసం వంశీపైడిప‌ల్లి ఓ క‌థ సిద్దం చేయ‌డం, వినిపించ‌డం కూడా జ‌రిగిపోయాయి. ఆ హీరో గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. త్వ‌ర‌లోనే వంశీ సినిమా ప‌ట్టాలెక్కేయ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close