`మన మద్రాసు కోసం’ మంచు లక్ష్మి ముందడుగు

సినీనటి మంచులక్ష్మి చెన్నై వరద బీభత్సానికి చలించిపోయారు. వరదబాధితుల సహాయం కోసం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో ఆధ్వర్యంలో ప్రారంభమైన `మన మద్రాసు కోసం’ కార్యక్రమంలో మంచు లక్ష్మి యాక్టీవ్ గా పాల్గొంటున్నారు. తాను పుట్టింది చెన్నైలోనేనని, మన తెలుగువాళ్లు చాలామంది వరదబాధితులుగా మారిపోయారనీ, ఇలాంటప్పుడే మనమంతా చెన్నైను ఆదుకోవాలని ఆమె మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

తనతోటి పదిమంది సినీనటులతో ఒక బృందంగా ఏర్పడి ఆదివారం(06-12-15) వరద బాధితులకు సహాయం కోసం ఆహారపదార్ధాలు, దుప్పట్లు నిత్యావసర వస్తువులను సేకరించబోతున్నారు. మంచు లక్ష్మి ఈ విషయాన్ని టివీల్లోనూ, సోషల్ మీడియా (ట్విట్టర్)లోనూ తెలియజేశారు. హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ సహా, మంజీరా, కుకట్ పల్లి ఫోరమ్ మాల్స్ వద్ద ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటలవరకు ఈ సినీబృందం అభిమానుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులను సేకరించడానికి సిద్ధంగా ఉంటారు. `మన మద్రాసు కోసం’ పేరిట ఈ బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మంచి లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఇప్పటికే సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది.

చెన్నైలోని వరద బాధితులకు సాయంచేయాలని ఇప్పటికే ఎంతోమంది అనుకుంటున్నారు, కానీ, ఎలా చేయాలో, నిత్యావసర వస్తువులను బాధితులకు ఎలా చేరవేయాలో తెలియక సతమతమవుతూనే ఉన్నారు. ఇలాంటివారికి ఒక మార్గం చూపే ప్రయత్నంగా `మన మద్రాసు కోసం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ఎలాంటి వస్తువులు ఎంత మొత్తంలో ఇవ్వాలన్న విషయం కూడా మంచులక్ష్మి తన టిట్వర్ ఖాతాలో ఉంచారు. పది కిలోల బియ్యం , ఐదు కిలోల కందిపప్పు , రెండు కిలోల షుగర్ , అర కిలో కారం, కిలో పసుపు, కిలో ఉప్పుతో పాటుగా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, చాపలు, దుప్పట్లు, దోమలు కుట్టకుండా ఓడోమస్ వంటివి, కిలో పాలపొడి వంటివి ఇవ్వొచ్చని ఆమె పేర్కొన్నారు. వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, గ్లోకూజ్, సాధారణ మందులు వంటివి కూడా ఇవ్వొచ్చు.

ఈ బృందంలో రానా దగ్గుబాటి, నాని కూడా యాక్టీవ్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ పైన చెప్పిన సరుకులు, వస్తువులు ఇవ్వలేకపోయినా, 12 వస్తువులను కలిపి నిర్వహకాలు ఒక బ్యాగ్ లా తయారుచేస్తారు. అలాంటి బ్యాగ్ లను ఈ సినీ బృందం చెన్నైలోని బాధిత కుటుంబాలకు అందిజేస్తుంది. ఆదివారం రాత్రి ఈ సామాన్లతో ట్రక్కులు రామానాయుడు స్టూడియోస్ దగ్గర నుంచి బయలుదేరి చెన్నైకి వెళతాయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు కూడా `మన మద్రాసు కోసం’ సహాయ కార్యక్రమానికి అండగా ఉన్నారు. ఆదివారంనాడు పైన పేర్కొన్న మాల్స్ దగ్గర చిత్ర బృందాన్ని కులుసుకుని ఇవ్వొచ్చు లేదా ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోస్ దగ్గర ఉంచిన కౌంటర్ల వద్ద కూడా అందజేయవచ్చు.

కాగా, సంచలన వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో – `కబుర్లు చాలామంది చెబుతారు. కానీ డబ్బులు రాల్చరు. ఎందుకంటే డబ్బులుచాలా కాస్ట్లీ కనుక’- అంటూ చురక అంటించారు. ఈ వ్యాఖ్యలు దేని గురించన్నది ఆయన ప్రస్తావించలేదు. వర్మ కామెంట్స్ ఇలా ఉంటే మరో పక్క టాలీవుడ్ నటులు చెన్నై వరదబాధితుల సహాయం కోసం లక్షలాది రూపాయలు విరాళంగా ప్రకటించారు. నటుడు సిద్దార్థ బాధితులకు ఆహారపదార్ధాలను, ఇతర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా తన కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం కోసం ఇతరుల సహాయాన్ని కోరుతున్నాడు. మద్రాసుతో దశాబ్దాల తరబడి ఉన్న సినీబంధం కారణంగా టాలీవుడ్ వరదబాధితులను ఆదుకోవడానికి విస్తృత కార్యక్రమాలను చేపట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close