మీడియా వాచ్‌: జ‌గ‌న్‌పై ‘ఈనాడు’ ప‌తాక స్థాయి పోరు

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. రాజ‌కీయాలు వేడెక్కాయి. మీడియా కూడా ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌నీ, అవినీతినీ ఎండ‌గ‌ట్ట‌డంలో ప‌దును పెంచుతోంది. ముఖ్యంగా ‘ఈనాడు’ ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పతాక స్థాయి పోరాటానికి న‌డుం బిగించింది. ఈమ‌ధ్య‌కాలంలో ఎన్న‌డూ లేనంత తీవ్ర స్థాయిలో జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తోంది. ప్ర‌తీ రోజూ.. ఓ అవినీతి ఉదంతాన్ని ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కిస్తోంది. తాజాగా ‘జె గ్యాంగ్ భూమంత‌ర్‌’ పేరుతో ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. వాన్ పిక్ పేరిట‌ 12,731 ఎక‌రాల భూమిని కేవ‌లం రూ.167 కోట్ల‌కు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌కి హ‌స్త‌గ‌తం చేసిన వైనాన్ని ప్ర‌చురించింది. ఈ భూ దోపిడీలో ఎవ‌రెవ‌రు ఉన్నారో వివ‌రాల‌తో స‌హా రాసింది. దీనిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే.. అవినీతిని ఒప్పుకొన్న‌ట్టే అనుకోవాలి.

విజ‌య‌వాడ‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన వేళ‌.. అస‌లు అంబేద్క‌ర్ ఆశ‌యాలేంటి? జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తోందేమిటి? అంటూ సూటిగా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన క‌థ‌నం కూడా ఎన్న‌ద‌గిన‌దే. ఇందుకోసం ‘దార్శ‌నికుడి దివ్య స్మృతికి దారుణ అవ‌మాన‌మిది’ పేరుతో ఈనాడు ఓ పూర్తి పేజీ కేటాయించ‌డం విశేషం. ఈనాడు లాంటి పత్రిక ఓ విష‌యం కోసం పూర్తి పేజీ కేటాయించ‌డం మామూలు విష‌యం కాదు. ‘అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ విద్యానిధి’ పేరు మీదున్న ప‌థ‌కం నుంచి.. అంబేద్క‌ర్ పేరు తీసేసిన ప్ర‌భుత్వానికి అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని తాకే అర్హ‌త ఎక్క‌డ ఉందం’టూ.. సూటిగా ప్ర‌శ్నించింది. అంబేద్క‌ర్ విధానాల‌కూ, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికీ న‌క్క‌కూ నాగ‌లోకానికీ ఉన్నంత తేడా ఉంద‌న్న విష‌యాన్ని చాటి చెబుతూ అక్ష‌ర బ‌ద్ధం చేసిన వ్యాసం కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చెమ‌ట‌లు ప‌ట్టించేదే. మొత్తానికి ‘ఈనాడు’ ప్ర‌జ‌ల గొంతుని వినిపించ‌డంలో అన్ని ప‌త్రిక‌ల కంటే ముందు వ‌రుస‌లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close