రిటైర్‌మెంట్‌పై మాట మార్చేసిన కీర‌వాణి

అప్పుడెప్పుడో ఓసారి రిటైర్‌మెంట్ గురించి సీరియ‌స్‌గా ట్వీట్ చేశాడు కీర‌వాణి. ఫ‌లానా సంవ‌త్స‌రం నుంచి నేను సినిమాలు మానేస్తున్నా.. అంటూ హింట్ ఇచ్చాడు. `బాహుబ‌లి 1` త‌ర‌వాతే…కీర‌వాణి సినిమాల‌కు దూరం అయిపోతాడ‌నుకున్నారు. కానీ… అది `బాహుబ‌లి 2` త‌ర‌వాత కూడా కొన‌సాగింది. ప్ర‌స్తుతానికైతే కీర‌వాణి రిటైర్‌మెంట్ అనే ఆలోచ‌న‌నే ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డం లేదు. వ‌రుస‌గా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. ఏదో ఓ వ్యాప‌కంలో బిజీగానే ఉంటున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా రాజ‌మౌళితో… త‌న ప్రయాణం కొన‌సాగుతోంది.

రిటైర్మెంట్‌పై అప్ప‌ట్లో ఓ ప్ర‌క‌ట‌న చేశారు క‌దా అని అడిగితే తెలివిగా స‌మాధానం చెప్పి త‌ప్పించుకున్నాడు. త‌ను స‌గం రిటైర్ అయిపోయిన‌ట్టే అంటూ లాజిక‌ల్‌గా మాట్లాడుతున్నాడు. ఇది వ‌ర‌కు హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌.. ఇలా అంద‌రి స‌మ్మ‌తితో న‌డుచుకునేవాడిన‌ని, ఆఖ‌రికి నిర్మాత మ‌న‌వ‌రాలు చెప్పిన‌ట్టు కూడా వినాల్సివ‌చ్చేద‌ని, ఇప్పుడు అలా కాద‌ని వీళ్ల‌లో ఒక్క‌రి మాటే వింటున్నాన‌ని, అలా…స‌గం రిటైర్ అయిన‌ట్టే అంటూ చ‌మ‌త్క‌రించాడు. కీర‌వాణి రిటైర్ కావాల‌ని ఎవ‌రూ కోరుకోలేదు. ఇప్ప‌టికీ మంచి సంగీతం అందించే స‌త్తా ఆయ‌న‌కు ఉంది. ఆయ‌నే రిటైర్‌మెంట్ మాట ఎత్తారు. అంత‌లోనే మాట మార్చారు. మ‌రి త‌న అభిప్రాయం మార్చుకోవ‌డం వెనుక ఉన్న కార‌ణం ఏమిటో ఆయ‌న‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల రోజుల్లో రేవంత్ స‌ర్కార్ కూలుతుంది… బీజేపీ ఎంపీ జోస్యం

తెలంగాణ‌లో పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల ప్ర‌చారంతో పాటు మాట‌ల వేడి కూడా పెరుగుతోంది. అయితే, బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి...

నర్సరావుపేట రివ్యూ : గాలి మారుతోంది !

నర్సరావుపేట కోడెల హయాంలో వైసీపీ కంచుకోట. కానీ నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటంతో .. కోడెల సొంత మండలాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో చేర్చేశారు. అదనంగా రెడ్డి...

కడపలో వైఎస్ ఓటు బ్యాంక్ చెరో ఓటు ట్రెండ్ – అవినాష్ పుట్టి మునిగినట్లే !

కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈ...

మంగళగిరిలో ఓటుకు నాలుగు వేలు..!?

కుప్పం.. మంగళగిరి.. పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కారణం అక్కడ చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తుండటమే. దీంతో వారిని ఎలాగైనా ఓడించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close