త్వ‌ర‌లోనే మోహ‌న్‌బాబు సంచ‌ల‌నం

‘గాయ‌త్రి’ క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంత ఆడింది? ఎన్ని డ‌బ్బులొచ్చాయి? ఎంత పోయింది? అస‌లు ఆ సినిమాని జ‌నం చూశారా, లేదా? అనే సంగ‌తుల్ని ప‌క్క‌న పెడితే – అందులోని పొలిటిక‌ల్ డైలాగులు బాగానే ఫేమ‌స్ అయ్యాయి. చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ను టార్గెట్ చేస్తూ… మోహ‌న్ బాబు పేల్చిన తూటాలు జ‌నంలోకి వెళ్లిపోయాయి. `అధికార పార్టీని ఢీ కొట్టి మోహ‌న్ బాబు పెద్ద సాహ‌స‌మే చేశాడు` అని జ‌నాలు కూడా చెప్పుకుంటున్నారు. అయితే త్వ‌ర‌లోనే మోహ‌న్ బాబు ఓ సంచ‌ల‌నానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మోహ‌న్ బాబు ఓ ప్రెస్ మీట్ పెట్టి… తెలుగు రాష్ట్రాల‌లో జ‌రుగుతున్న అవినీతిని ఎండ‌గ‌ట్టేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యార‌ని, అప్ప‌టి నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణం వేరే కోణంలో సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది.

అంతేకాదు…. త‌న జీవిత ప్ర‌యాణానికి సంబంధించి ఓ పుస్త‌కం కూడా త‌యారు చేస్తున్నారు మోహ‌న్ బాబు. అందులో కొన్ని సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్ట‌డానికి రెడీ అయ్యారు. అటు పుస్త‌కం, ఇటు ప్ర‌సంగంతో రాజ‌కీయ ప‌రంగా సెగ‌లు క‌క్కించ‌డానికి మోహ‌న్ బాబు వ్యూహ ర‌చ‌న చేస్తున్నార‌ని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మోహ‌న్ బాబు వైఖ‌రి ఏ పార్టీకి ప్ల‌స్‌, ఏ పార్టీకి మైన‌స్ అనే కోణంలో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మ‌రి మోహ‌న్ బాబు పేల్చే పొలిటిక‌ల్ డైలాగులు ఎంత ప‌వ‌ర్ ఫుల్లో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక ప‌ట్టాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.