“మోజో” క్లోజ్..! రోడ్డున పడబోతున్న ఉద్యోగులు..!

తెలుగు మీడియాలో.. తనదంటూ ఓ ముద్ర వేసుకునే ప్రయత్నంలో… ముందడుగులు వేసిన మోజో టీవీ .. శాశ్వతంగా మూతపడబోతోంది. టీవీ9 అమ్మకం వివాదం .. మోజో టీవీ వ్యవహారాలపైనా తీవ్ర ప్రభావం చూపింది. యాజమాన్యం మారిపోయింది. అయితే.. మారిపోయిన మజమాన్యం.. చానల్‌ను నడిపే లక్ష్యంతో కాక.. ముందు నుంచి .. దాన్ని మూసేయాలన్న లక్ష్యంతోనే పని చేసింది. ఆ లక్ష్యాన్ని మూడు నెలల్లోనే సాధిస్తున్నారని.. తాజా పరిణామలతో తేలిపోయింది. మోజో టీవీని మూసేస్తున్నట్లు… కొత్త యాజమాన్యం.. ఉద్యోగులకు అధికారికంగా తెలిపింది. ఒక్కొక్కరికి.. ఒక్కో నెల జీతం అదనంగా ఇస్తామని.. సరిపెట్టుకుని సంస్థ నుంచి వెళ్లిపోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు.

ఇంత హఠాత్తుగా చానల్‌ను మూసేస్తే… తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతాయని.. కనీసం నిబంధనల ప్రకారం మూడు నెలల జీతం అయినా ఇవ్వాలని యాజమాన్యాన్ని ఉద్యోగులు కోరుతున్నారు. కానీ యాజమాన్యం మాత్రం.. అలాంటి అవకాశమే లేదని.. ఒక్క నెల జీతం మాత్రం అదనంగా ఇస్తామని.. తీసుకుని వెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులు… దానికి ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. చానల్‌ను మూసేస్తున్నట్లుగా ప్రకటించేశారు. దీంతో ఉద్యోగులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 160 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. నిజానికి మోజో టీవీలో కొత్త డైరక్టర్లు వచ్చి చేరిన తర్వాత ఖర్చులు పూర్తిగా నియంత్రించారు. జిల్లాల్లో.. కార్యాలయాలకు అద్దెలు కట్టడం కూడా మానేశారు. విజయవాడలో స్టూడియో ఉన్నప్పటికీ కరెంట్ బిల్లు కూడా కట్టకపోవడంతో… అది కూడా క్లోజ్ అయింది. మెల్లగా.. ఉద్యోగుల్ని కూడా తగ్గించారు. ఇప్పుడు.. నేరుగా మూసేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

టీవీ9 నిధులతోనే.. మోజో టీవీని నడుపుతున్నారన్న ఆరోపణలు.. మొదటి నుంచి.. టీవీ9ను కొనుగోలు చేసిన అలంద మీడియా చేస్తోంది. ఈ కోణంలో.. మోజో టీవీ చైర్మన్ చేరెడ్డి హరికిరణ్‌ను.. ఓ సారి పోలీస్ స్టేషన్‌లో బంధించి.. మోజో టీవీని రాయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు.. ఇదే అంశంపై మోజో టీవీలో… అప్పటి సీఈవో రేవతి… మూడు గంటల సేపు చానల్‌లో బ్రేకింంగ్ న్యూసులు వేసి.. హడావుడి చేశారు. ఈ క్రమంలో.. ఆ చానల్ ప్రసారాలను నిలిపివేశారు కూడా. అయితే.. తెల్లవారే సరికి పరిస్థితి మారిపోయింది. చానల్ నుంచి సీఈవో రేవతిని పంపేశారు. డైరక్టర్లు కూడా మారిపోయారు. మైహోం రామేశ్వరరావుకు అత్యంత సన్నిహితులు… డైరక్టర్లుగా చేరారు. వారు..మోజో టీవీ మూసివేత లక్ష్యంగా పని చేసి.. పని పూర్తి చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close