రివ్యూ: మంత్ అఫ్ మధు

Month Of Madhu Movie Review

తెలుగు360 రేటింగ్ : 2.25/5

నటుడిగా నవీన్ చంద్ర ప్రయాణం విలక్షణంగా సాగుతోంది. హీరోగా చేస్తూనే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభన్నమైన పాత్రలు చేస్తున్నాడు. అటు ఓటీటీపై కూడా దృష్టిపెట్టాడు. నవీన్ చంద్ర నటించిన ‘భానుమతి & రామకృష్ణ’ ఆహలో విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో మరోసారి కలసి ఇప్పుడు ‘మంత్ అఫ్ మధు’ సినిమా చేశాడు. చాలా రోజుల తర్వాత కలర్స్ స్వాతి ఈ చిత్రంలో నటించారు. ప్రచార చిత్రాలు ఆసక్తిని పెంచాయి. భానుమతి & రామకృష్ణ’ తో ఓటీటీ హిట్ కొట్టిన ఈ కాంబో వెండితెరపై ఎలాంటి భావోద్వేగాల్ని పంచింది?

వైజాగ్ లో జరిగే కథ ఇది. మధుసూదనరావు అలియాస్ మధు ( నవీన్ చంద్ర), లేఖ( కలర్స్ స్వాతి) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. మధు అంటే లేఖకి పిచ్చి ప్రేమ. మధు మాత్రం కాస్త వింత మనిషి. తనకి ఎవరిదగ్గర ఉద్యోగం చేయాలని వుండదు. తాగుతాడు. భాద్యత తీసుకోడు. చెప్పింది వినడు. తనకి నచ్చిందే చేస్తాడు. పైగా ఆవేశం. ఇలాంటి వ్యక్తిని ఇరవై ఏళ్ళు భరించిన లేఖ.. ఇంక తనవల్ల కాక విడాకులు తీసుకోవాలని కోర్టుని ఆశ్రయిస్తుంది. వీళ్ళ కథ నడుస్తుండగా… అమెరికా నుంచి మధుమతి ( శ్రేయా) అనే అమ్మాయి తన కజిన్ పెళ్లి కోసం వైజాగ్ వస్తుంది. ఓ రోజు బీచ్ లో మధుని కలుస్తుంది. అదే సమయంలో యోగా క్లాసుల్లో పరిచయమైన ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. తర్వాత ఈ ముగ్గురి ప్రయాణం ఏ తీరాలకు చేరిందనేది మిగతా కథ.

ఆర్ట్ సినిమా తీసినా ఆసక్తికరంగా వుండాలి. ప్రతి కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. పాత్రలు, వాటి ఎమోషన్ ఏమిటనేది ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే చాలు.. మిగతా అంశాలు వున్నాలేదా లేదా అంది ప్రేక్షకుడు పట్టించుకోడు. ఆ పాత్రలతో ప్రయాణం చేసేస్తాడు. ‘మంత్ అఫ్ మధు’ కూడా ఎలాంటి కమర్షియల్ అంశాలు లేని కథే. అయితే ఇందులో పాత్రలు, వాటి ఎమోషన్ లేయర్ ప్రేక్షకులకు పట్టదు.

మధుసూదనరావుతో లేఖ అన్నయ్య బార్ లో గొడవ పడే సన్నివేశంతో ఈ కథ మొలుపెట్టాడు దర్శకుడు. తర్వాత పాస్ట్, ప్రెజెంట్ లోని సన్నివేశాలని పేర్చుకుంటూ వెళ్ళాడు. గతంలో మధుని ప్రాణంగా ప్రేమించిన లేఖ.. ఇప్పుడు ఎందుకు విడాకులు కోరుతుంది ? దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? ఈ డ్రామా చూద్దామని ప్రేక్షకుడు భావిస్తే మాత్రం నిరాశతప్పుదు. అసలు ఇందులో పాత్రల మధ్య సంఘర్షణ ఏమిటి ? అనే ప్రశ్న వేసుకుంటే.. ఇందులో మధు పాత్ర చెప్పే కామన్ డైలాగ్ ‘ఎవడికి తెలుసు’ అనేదే సమాధానం.

మోడరన్ ఆర్ట్ అనే భ్రమలో నడుస్తున్న ఈ రెండు పాత్రలు చాలవన్నట్లు అమెరికా నుంచి ఇంకో మధు దిగుతుంది. ఈ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పదలచుకున్న విషయం ఏమిటో ఒకపట్టానా అర్ధం కాదు. అమెరికా మధు, వైజాగ్ మధుని బీచ్ లో కలుస్తుంది. తర్వాత టైటిల్ తగ్గట్టు కథలో ఎదో జరుగుతుందని ఆశ పడితే మళ్ళీ నిరాశ తప్పదు. అమెరికాలో పుట్టి పెరిగన అమ్మాయి .. ఇండియా కల్చర్ కి తగ్గట్టు బిహేవ్ చేయమని అడిగితే,, ఆమెకు చాలా కష్టంగా వుంటుందనే పాయింట్ ఎదో చూపించాలనుకున్నారేమో కానీ ఈ కథలో ఆమె కంప్లీట్ నాన్ సింక్. పైగా ఈ పాత్రని తీర్చిద్దిన విధానం కూడా ఎన్ఆర్ఐ ల పట్ల దర్శకుడికి వున్న ఓవర్ ఇమాజినేషన్ అనిపిస్తుంది. ఈ కథకు ముగింపు కూడా అయోమయంగా అస్పష్టంగా వుంది.

”పెళ్లి అనే బంధంలో ఇద్దరు లేకపోతే వంటరిగా వుండిపోవడమే మంచిది”.
”మీ కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకండి”
‘వాడిదేం తప్పులేదు. వాడికి వచినట్లు వాడు ప్రేమించాడు’’ ఈ కథలో లేఖ పాత్ర చెప్పే కీలకమైన మాటలివి. ఒకవేళ దర్శకుడు ఈ మాటల్లోని లోతుని కథలో చెప్పదలిచాడని భావిస్తే మాత్రం.. సన్నివేశాలని అల్లుకున్న తీరులో పూర్తిగా తడబడిపోయాడనే చెప్పాలి.

మధు పాత్రలోకి నవీన్ చంద్ర సహజంగా వెళ్ళిపోయాడు. తాగుబోతుగా కుదిరిపోయాడు. అయితే తన పాత్రలో బార్ సీన్లే ఎక్కువ వుండటంతో ఒకే ఎమోషన్ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. స్వాతి పాత్ర గతంలో కాస్త యాక్టివ్ గా వుంటుందేమో కానీ వర్తమానంలో ఓ మౌనమూర్తిలా దీనమైన ఎక్స్ ప్రెషన్ తో దాదాపు సినిమా అంతా కనిపిస్తుంది. మరో మధు పాత్రలో చేసిన శ్రేయా నటన ఓకే అనిపిస్తుంది. వైజాగ్ యాసలో మాట్లాడిన హర్ష అక్కడక్కడ కాస్త నవ్విస్తాడు. రాజా రెండు సీన్స్ లో కనిపిస్తాడు. మిగతా పాత్రలు పరిథిమేర వున్నాయి.

అచ్చు రాజమణి అందించిన పాటలు రిజిస్టర్ కావు కానీ నేపధ్య సంగీతం బావుంది. సింక్ సౌండ్ వాడకం బావుంది. రాజీవ్ ధరావత్ మంచి కెమరాపనితనం కనబరిచాడు. ఎడిటింగ్ లో లోపం లేదు దర్శకుడు తీసిన సన్నివేశాలే సుదీర్గంగా సాగదీతగా వున్నాయి. మాటల్లో కొలతలు చూసుకోలేదు. సుదీర్గంగా మాట్లాడుతూనే వుంటాయి. ఒక లైఫ్ జర్నీని చూపించాలనే ప్రయత్నం చేసిన దర్శకుడు ఆ ప్రయాణాన్ని ఆసక్తిగా మలచలేకపోయాడు.

తెలుగు360 రేటింగ్ : 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close