ఎంతో చేశాను… కాస్త పట్టించుకోవాలని జగన్‌కు ముద్రగడ లేఖ..!

కాపు రిజర్వేషన్ల పోరాట నేత ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదో ఆశిస్తున్నారు. ఆ ఆశించినదానికి సంబంధించిన హామీ ఆయనకు దక్కడం లేదు. అందుకే.. సంబంధం లేని అంశాల మీద పదే పదే లేఖలు రాస్తున్నారు. కొద్ది రోజలు క్రితం.. ద్విచక్ర వాహనదారులపై కేసులు రాస్తున్నారంటూ.. అలా చేయవద్దని నేరుగా జగన్‌కు రాశారు. అసలు.. ముద్రగడ పద్మనాభానికి.. ఆయన రాసిన లేఖకు పొంతన ఏంటో చాలా మందికి అర్థం కాలేదు. తాను ఉన్నానని గుర్తు చేయడానికే ఆ లేఖ రాశారాని చాలా మంది అనుకున్నారు. ఆ కోణంలో మంగళవారం మరో లేఖ రాశారు ముద్రగడ. ఆ లేఖలో.. జగన్మోహన్ రెడ్డిని..” ప్లీజ్.. ప్లీజ్ ” అని నేరుగా బతిమాలుకోవడం లేదు కానీ… ఆ మాటల్లో మాత్రం అంత కంటే అర్థం ఉంది.

కాపు రిజర్వేషన్ గురించి మీరు హామీ ఇవ్వలేదని.. పద్మనాభం అవసరం లేకపోయినా జగన్ కు తన లేఖలో గుర్తు చేసి.. గత ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ ఫైల్ కేంద్రం వద్ద ఉందని.. దాని కోసం.. మోడీకి లేఖ రాయమని కోరారు. అడగక తప్పడం లేదని కూడా లేఖలో రాసుకొచ్చారు ముద్రగడ. రిజర్వేషన్ల కోసం.. ముద్రగడ ఇలా లేఖ రాశారంటే.. అది ఆయన ఉద్యమంలో భాగం అనుకోవచ్చు కానీ… తర్వాత తాను ఏదో ఆశిస్తున్నట్లుగా.. సందేశం పంపేలా.. ఎక్కువ వాక్యాలు రాసుకొచ్చారు. గత ప్రభుత్వంలో తాను వేధింపులకు గురయ్యానని చెప్పడమే కాదు.. పిల్లలకు ఇవ్వడానికి ఆస్తిపాస్తులేమీ లేవని.. సందర్భం లేకపోయినా చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగలేదు.. జగన్ కోసం.. తాను చాలా చేశానని.. గతంలో జరిగిన ఘటనలు ఉదహరించారు. ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించి.. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యానని..పెద్ద ఎత్తున సొంతఖర్చులతో ఏర్పాట్లు చేశానని.. పాదయాత్ర సందర్భంగా… రాజమండ్రి వంతెన మీద భారీ జనసమీకరణ చేశానని ముద్రగడ ప్రకటించుకున్నారు. కావాలంటే.. మీ పక్కన ఉండే.. పలువురు రెడ్డి నేతల్ని అడగాలని.. ముద్రగడ లేఖలో జగన్ కు చెప్పారు. ఈ లేఖలో ఉన్న విషయాలను బట్టి చూస్తే.. ముద్రగడకు కావాల్సింది… వేరే ఏదో ఉందని.. దాని కోసం.. జగన్మోహన్ రెడ్డికి ఈ పద్దతిలో లేఖలు రాస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ముద్రగడకు ఏం కావాలో జగన్ చూస్తారో లేదో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close