చైతూ ప్రేమ‌క‌థ‌లో దేశ‌భ‌క్తి కూడా..!

ల‌వ్ స్టోరీల‌కు నాగ‌చైత‌న్య స‌రిగ్గా స‌రిపోతాడు. ఇప్పుడు చందూ మెండేటితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ల‌వ్ స్టోరీనే. కాక‌పోతే.. ఇందులో దేశ‌భ‌క్తిని సైతం మేళ‌వించిన‌ట్టు టాక్‌. ల‌వ్ స్టోరీని ప్లెయిన్‌గా చెబితే స‌రిపోవ‌డం లేదు. ఎగ‌స్ట్రా ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అందుకే చందూ మొండేటి ఇంకాస్త కేర్ తీసుకొన్నాడు. 2018లో కొంత‌మంది మ‌త్య‌కారుల జీవితంలో జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న‌ల్ని ఆధారంగా చేసుకొని ఈ క‌థ‌ని రాసుకొన్నాడు. అందులో ఎమోష‌న్ డ్రామా, ల‌వ్ స్టోరీ, దేశ భ‌క్తీ ఇవ‌న్నీ మేళ‌వించిన‌ట్టు టాక్‌. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య ఓ మ‌త్యకారుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఆ పాత్ర కోసం ప్ర‌త్యేకంగా హోమ్ వ‌ర్క్ కూడా మొద‌లెట్టాడు. విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం జిల్లాల్లోని మ‌త్య‌కారుల‌తో చైతూ భేటీ అయ్యాడు. 2018లో జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న‌కు సంబంధించిన విష‌యాలు వాళ్ల నుంచి అడిగి తెలుసుకొన్నాడు. ఈ సినిమాలో చైతూ గెట‌ప్ స‌రికొత్త‌గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. అందుకు సంబంధించి త్వ‌ర‌లో లుక్ టెస్ట్ కూడా చేయ‌బోతున్నార్ట‌. క‌థానాయిక‌గా కీర్తి సురేష్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. చైతూ – కీర్తి ఇప్ప‌టి వ‌ర‌కూ క‌లిసి న‌టించ‌లేదు. కాబ‌ట్టి అది కొత్త కాంబో అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close