‘మానాడు’ రీమేక్‌… చైతూ రియాక్ష‌న్‌

వెంక‌ట్ ప్ర‌భు సినిమాల్లో ‘మానాడు’కి ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. టైమ్ లూప్ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల్లో ‘మా నాడు’ ది బెస్ట్. చాలా కాలం త‌ర‌వాత శింబు కి ఓ మంచి విజ‌యాన్ని అందించిన సినిమా ఇది. సూర్య‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తార‌ని వార్త‌లొచ్చాయి. నాగ చైత‌న్య‌, వెంక‌ట్ ప్ర‌భు క‌లిసి ఓ సినిమా చేస్తున్నార‌న్న సంగ‌తి బ‌య‌ట‌కు పొక్క‌గానే అది.. ‘మానాడు’ రీమేక్ అనుకొన్నారు. అయితే.. ‘క‌స్ట‌డీ’లాంటి వేరే క‌థ‌ని ఎంచుకొని అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేశారు వీరిద్ద‌రూ. `మానాడు ` రీమేక్‌తోనే వెంక‌ట్ ప్ర‌భు నాగ‌చైత‌న్య‌ని క‌లిశాడ‌ని, అయితే రీమేక్ సినిమాలు చేయ‌డం ఇష్టం లేక‌.. నాగ‌చైత‌న్య ‘మానాడు’ని ప‌క్క‌న పెట్టాడ‌ని మాట్లాడుకొన్నారు. వీటిపై నాగ చైత‌న్య స్పందించాడు.

”మానాడు రీమేక్ చేయాల‌న్న ఆలోచ‌న మా ఇద్ద‌రికీ లేదు. ‘మానాడు’ రిలీజ్‌కి ఆరు నెల‌ల ముందే వెంక‌ట్ న‌న్ను క‌లిశాడు. ఈ క‌థ చెప్పాడు. వెంట‌నే ఓకే చేశా. ‘మానాడు’ లాంటి క‌థ‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు. రీమేక్ చేసి ఆ మ్యాజిక్‌ని మ‌ళ్లీ సృష్టించ‌లేం” అని క్లారిటీ ఇచ్చేశాడు నాగ‌చైత‌న్య‌. `క‌స్ట‌డీ` సినిమాపై మాత్రం చైతూ వీర కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. ”ఈ సినిమాని శివ‌తో చాలామంది పోలుస్తున్నారు. నాకు వ్య‌క్తిగ‌తంగా పోలిక‌లు ఇష్టం ఉండ‌వు. ఒక్క‌టి మాత్రం క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. నా సినిమాల్లో ‘క‌స్ట‌డీ’ ది బెస్ట్ గా నిలుస్తుంది” అని ధీమా వ్య‌క్తం చేశాడు. క‌స్ట‌డీ హిట్ట‌యితే.. వెంట‌నే క‌స్ట‌డీ 2 కూడా ప‌ట్టాలెక్కిస్తామ‌ని ప్రామిస్ చేశాడు చైతూ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close