నాగ్ బాట‌లో… నాగ చైత‌న్య‌

కోవిడ్ కార‌ణంతో షూటింగుల‌న్నీ ఎక్క‌డ‌క‌క్క‌డ ఆగిపోయాయి. ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇచ్చినా, చిన్న చిత‌కా సినిమాలే మొద‌ల‌య్యాయి త‌ప్ప‌, స్టార్లెవ‌రూ బ‌య‌ట‌కు రాలేదు. ఇటీవ‌ల నాగార్జున `వైల్డ్ డాగ్` షూటింగ్ మొద‌ల‌య్యారు. ఇప్పుడు తండ్రి బాట‌లోనే త‌న‌యుడు కూడా అడుగులేస్తున్నాడు. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ రోజు మొద‌లైంది. కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నామ‌ని, అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లూ తీసుకుంటున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. వేస‌విలో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కుద‌ర్లేదు. సింగిల్ షెడ్యూల్ లోనే మిగిలిన షూటింగ్ అంతా పూర్తి చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అన్ని సినిమాల్లానే ఈ చిత్రానికీ ఓటీటీ ఆఫ‌ర్లు బాగా వ‌స్తున్నాయి. కానీ శేఖ‌ర్ క‌మ్ముల మాత్రం థియేట‌ర్లో రిలీజ్ చేయ‌డానికే ఆస‌క్తి చూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్రేటర్‌”లో ఇప్పుడు పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత రాజకీయం..!

గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సర్జికల్ స్ట్రైక్స్ నుంచి కూల్చివేతల వరకూ వచ్చింది. ఒకరు పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌ల గురించి మాట్లాడగా.. మరొకరు దారుస్సలాం కూల్చివేత గురించి మాట్లాడుకోవడంతో రగడ మలుపు తిరిగింది....

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

HOT NEWS

[X] Close
[X] Close