నాగచైతన్య, విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో కలసి చేస్తున్న సినిమా వృషకర్మ. తాజాగా గ్లింప్స్ ని రిలీజ్ సినిమా వరల్డ్ ని పరిచయం చేశారు. ‘అతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది’ అనే వాయిస్ తో ప్రజెంట్ చేసిన గ్లింప్స్ కథపై ఆసక్తిని పెంచింది.
దుష్టశక్తి గల ఓ వ్యక్తి ఒక చిత్రాన్ని గీయడం, అతని లోపల నుంచి ఒక భయంకరమైన శక్తిగా గబ్బిలం బయటికి వచ్చి మరో వ్యక్తి తలలోకి దూసుకెళ్లిన సన్నివేశం.. ఈ సినిమా ఎంత డార్క్ ఎలిమెంట్స్ తో వుంటుందో చెప్పకనే చెప్పింది. దుష్టశక్తిని ఎదుర్కొనే వృషకర్మగా చైతు ఎంట్రీ ఇవ్వడంతో కథపై ప్రేక్షకుడికి ఒక ఐడియా వచ్చేలా చేశారు.
ఈ గ్లింప్స్ లో వరల్డ్ బిల్డింగ్ ప్రత్యేకంగా నిలిచింది. ఇదివరకూ చూడని బ్యాక్ డ్రాప్ కనిపించింది. నాగ చైతన్య క్యారెక్టర్ లుక్ కూడా కొత్తగా వుంది. ఇలాంటి జానర్ కథ చేయడం ఆయనకి ఇదే తొలిసారి. విలన్ గా శ్రీవాస్తవ, అలాగే హీరోయిన్గా మీనాక్షి పాత్రలు గ్లింప్స్ లో కీలకంగా కనిపించాయి. దర్శకుడు కార్తిక్ దండు ఎంచుకున్న పాయింట్ కొత్తగా వుంది. అజినీస్ మ్యూజిక్ కూడా మరింత ప్రభావాన్ని జోడించింది. మొత్తానికి గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.


