ఆ కాన్వెంట్‌లో… నాగ్‌ది పెద్ద పాత్రేనండోయ్‌

నిర్మ‌లా కాన్వెంట్‌.. క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ తొలి సినిమా కాబ‌ట్టి అంతో ఇంతో ఈ సినిమాకి క్రేజ్ ఏర్ప‌డింది. నాగార్జున ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం మ‌రోప్ల‌స్సు. అంతేకాదు.. ఇందులో నాగ్ ఓ పాట‌లోనూ క‌నిపిస్తాడు. పాట‌తో మాత్ర‌మే స‌రిపెట్ట‌లేదు. ఈ సినిమాలో నాగ్ ఓ కీల‌క పాత్ర పోషించాడు. ఈరోజు విడుద‌లైన నిర్మ‌ల కాన్వెంట్ ట్రైల‌ర్ చూస్తే ఆ విష‌యం అర్థ‌మైపోతుంది. ట్రైల‌ర్‌లో నాగ్‌.. ఈ సినిమా క‌థ‌ని చెప్పే బాధ్య‌త త‌న భుజాల‌పై వేసుకొన్నాడు. కాన్వెంట్‌లో త‌న‌ది గెస్ట్ రోల్ కాదు.. కీ రోల్ అన్న సంగ‌తి ఈ ప్ర‌చార చిత్రం చూస్తుంటే అర్థ‌మైపోతుంది. రోష‌న్ కూడా క్యూట్‌గా ఉన్నాడు. నిన్ను లేపుకుపోతా.. అంటూ ఓ డైలాగ్ కూడా ప‌లికాడు. ప‌క్కా ప్యూర్ టీనేజ్ ల‌వ్ స్టోరీలు ఈమ‌ధ్య చాలా వ‌స్తున్నాయి. అయితే అందులో సెన్సిబిలిటీస్ మాత్రం మిస్ అవుతున్నాయి. కానీ నిర్మ‌లా కాన్వెంట్‌లో మాత్రం.. ఆ కోవ‌కు చెందిన క‌థ కాద‌నిపిస్తుంది. లొకేష‌న్లు, ఆర్టిస్టులు, ఆ మూడ్ చూస్తుంటే సినిమాలో ఏదో విష‌యం ఉన్న‌ట్టే అనిపిస్తుంది. అన్నింటికంటే నాగ్ ఉండ‌నే ఉన్నాడు. ప్ర‌మోష‌న్‌ని కూడా ఆయ‌న త‌న భుజాల‌పై వేసుకొని న‌డిపించేస్తాడు. సో… నిర్మల పై హోప్స్ పెట్టుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close