ప్రొ. నాగేశ్వర్: వాజ్‌పేయికి ఇచ్చే గౌరవం మాటల్లోనేనా…?

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి దేశం మొత్తం ఘన నివాళి అర్పించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా భద్రతను కూడా లెక్క చేయకుండా… ఏడు కిలోమీటర్ల మేర నడిచారు. ఆయన స్మృత్యర్థం.. స్మృతి స్థల్‌లో పెద్ద స్మారకం రాబోతోంది. ఈ గౌరవాలన్నింటికీ ఆయన అర్హుడే. కానీ అటల్ బిహారీ వాజే పేయి పేరిట 2011లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం భోపాల్ లో ఉంది. దాని పరిస్థితి చూస్తే…. నిజంగా అటల్ కి గౌరవం ఇస్తున్నారా అని అనిపించక మానదు.

గొప్ప ఆశయంతో అటల్ పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటు..!

మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2011లో అటల్ బిహారీ వాజ్ పేయి పేరిట ఓ యూనివర్శిటీ ప్రారంభించింది. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఓ ఉత్తమ ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఆయనకు హిందీ భాషపై ఎనలేని మక్కువ. దాని కోసం ప్రచారం చేశారు. స్వయంగా కవి కూడా. ఆయన కవితలు చాలా ప్రసిద్ధి చెందాయి. అందుకే ఆయన గౌరవార్ధం హిందీ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో…. హిందీ మీడియంలోనే…. ఇంజినీరింగ్, పారామెడికల్ కోర్సులు కూడా అందివ్వాలని వినూత్న ఐడియాను కూడా అమల్లోకి తెచ్చింది. మన దేశంలో మాతృభాషలో ఇంజినీరింగ్, మెడికల్ లాంటి కోర్సులు చేయలేమనే అభిప్రాయం ఉంది. కానీ ఆ అభిప్రాయాన్ని తుడిచి పెట్టేసి… హిందీ మీడియాంలోనూ వీటీని చదవొచ్చని.. నిరూపించేందుకు అటల్ పేరిట ఏర్పాటు చేసిన యూనివర్శిటీని ఏర్పాట్లు చేశారు. ఈ వర్శిటీ లక్ష్యాలు, ఆశయాలు చాలా గొప్పవి.

ప్రారంభించి వదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..!

ఈ యూనివర్శిటీకి భోపాల్ లో… మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. ఇప్పటి వరకూ… ఆ యూనివర్శిటీని పట్టించుకున్న పాపాన పోలేదు. 2011లో ఏర్పాటు చేశారు. 2013లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా… నాలుగేళ్లు దాటిపోయింది. ఇది బీజేపీ ప్రభుత్వమే. వాజ్ పేయిన మహా నాయకుడిగా పేర్కొంటున్న పార్టీనే అధికారంలోకి వచ్చింది. కానీ ఈ నాలుగేళ్లలో శాశ్వతభవనాల నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. క్యాంపస్ ఓ చోట.. క్లాసులు ఓ చోట ఉంటాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి 92 కోర్సులను రద్దు చేశారు. ఎందుకంటే.. నిధుల్లేవని.. వైఎస్ చాన్సలర్ చెబుతున్నారు. ఈ వర్శిటీకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 3 కోట్ల 75 లక్షలు మాత్రమే ఇస్తోంది. ఈ కొద్ది మొత్తంతోనే వర్శిటీ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.

అటల్ వర్శిటీలో రెండు షెడ్లు తప్ప ఏమీ లేవు…!

వాజ్ పేయిని పితృసమానంగా భావిస్తున్న మోడీ… ఆయనను మూలపురుషునిగా భావిస్తున్న బీజేపీ నేతలు…. ఆయన పేరిట ఏర్పాటయిన యూనివర్శిటిపై అత్యంత దారుణమైన నిరాదరణ చూపుతున్నారు. ఆయన పేరిట ఏర్పాటయిన యూనివర్సిటీకి భవనాలు లేవు, నిధులు లేవు. హిందీ మీడియంలో కోర్సులు నిర్వహించడానికి మౌలిక వసతులు లేవు. ఫ్యాకల్టీ లేదు. మొదట్లో వేలల్లో చేరిన విద్యార్థులు … ఇప్పుడు ఆ యూనివర్శిటీ వైపు వెళ్లడం లేదు. ఇప్పుడు కేవలం 800 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పారా మెడికల్ కోర్సులు హిందీ మీడియంలో నిర్వహించడం లక్ష్యం అయితే…. దీనికి తగ్గట్లుగా… ఒక్క శాతం మౌలిక సదుపాయాలు… పుస్తకాలు, సిలబర్, క్లాస్ రూమ్ లేవు.

అటల్ యూనివర్శిటీ సర్టిఫికెట్లు చెల్లవు..!

ఈ యూనివర్శిటీలో చదువుకుని … బయట ఉద్యోగాల కోసం వెళ్లిన వారికి…. షాక్ తగులుతోంది. ఎందుకంటే… ఆ సర్టిఫికెట్లు చెల్లవని అందరూ చెబుతున్నారు. యూజీసీ గుర్తింపు అటల్ యూనివర్శిటీకి లేకపోవడమే కారణం. ఎందుకంటే… ఈ యూనివర్శికీ ఎవరి అనుమతులు తీసుకోలేదు. ఏఐసిటీఈ గుర్తింపు కోసం ప్రయత్నించలేదు. ఈ ఏఐసీటీఈ గుర్తింపు లేని సర్టిఫికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. కానీ వాటిని గుర్తించడానికి… ఉద్యోగాలిచ్చేవాళ్లు సిద్దం కాలేదు. ఇప్పుడు ఈ యూనివర్శిటీ మనుగడ ప్రశ్నార్థకం అయింది.

మాటల్లో కాకుండా చేతల్లో ఆయనకు నివాళి అర్పించాలి..!

వాజ్ పేయిని మహానాయకుడిగా పేర్కొంటూ బీజేపీ అగ్రనేతలు రోజూ… ఏదో ఓ ప్రకటన చేస్తూంటారు. నిజానికి ఆయనకు ఇచ్చే నివాళి…. కచ్చితంగా ప్రకటనలు మాత్రం కాదు. ఆయనను గౌరవించాలంటే.. ఆయన పేరిట ఉన్న యూనివర్శిటీని .. లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా నడిపించింది. వాజ్‌పేయిపై అమితమైన గౌరవం ఉంటే.. ఆయన పేరిట ఉన్న యూనివర్శిటీని సెంట్రల్ యూనివర్శిటీగా ప్రకటించవచ్చు కదా. తన పేరిత ఏర్పాటయిన యూనివర్శిటీ దుస్థితి ఇలా ఉందని తెలిస్తే… వాజ్ పేయి కూడా బాధపడి ఉండేవారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు… హిందీ మీడియాంలోనే… ఇంజినీర్లు, డాక్టర్లను తయారు చేసేలా… యూనివర్శిటికీ జవసత్వాలు కల్పించాలి. నిధులు కేటాయించి.. క్యాంపస్ నిర్మాణం చేసి… లైబ్రరీ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించి… పేరుకు తగ్గట్లుగా…. అటల్ బిహారా వాజ్‌పేయి హిందీ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధికి చేయాలి. ఆయనకు చేతల్లో నివాళి అర్పించారి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com