ఆర్టీసీ కోసం డబ్బుల్లేవు…మేడారం జాతరకు రూ.75 కోట్లు…!

ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు. ఆర్థిక మాంద్యం కారణంగా ఖజానా నిండుకుంది. కనాకష్టంగా ఉంది. బతుకు ఈడ్చడం తిప్పలుగా ఉంది. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. అసలు ఆర్టీసీయే పెద్ద గుదిబండలా తయారైంది.దాన్ని నడిపించడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతుంది. దాన్ని మోయలేం. సగం ప్రైవేటుకు ఇవ్వాల్సిందే. సగం మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌, సీఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపాల్సిందే…. ఇదీ బయటైనా, హైకోర్టులోనైనా కేసీఆర్‌ సర్కారు వాదన. డబ్బుల్లేకనే ఈ ఏడాది నవంబరు 14న బాలల దినోత్సవం రోజున అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం నిర్వహించలేకపోయాం….ఇదీ కేసీఆర్‌ సర్కారు ఇచ్చిన సంజాయిషీ.

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి హైదరాబాద్‌ శాశ్వత వేదిక. ఆ సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసు. కాని ఆర్థిక మాంద్యం సాకుతో ఫిలిం ఫెస్టివల్‌ రద్దు చేసి పారేశాడు. ఇంకేవో పథకాలను కుదించాడు. కాని ఇంతటి ఆర్థిక మాంద్యంలోనూ, ఇంతటి డబ్బుల్లేని స్థితిలోనూ మేడారం జాతరకు ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇది ప్రభుత్వం (మంత్రులు) చెప్పిన సంగతే. జాతర కోసం ఖర్చు పెట్టడానికి పైసలెట్లా వచ్చినయ్‌? ప్రభుత్వం (కేసీఆర్‌) అనుకుంటే డబ్బులొస్తాయి. అనుకోకపోతే డబ్బులుండవు. ఆర్‌టీసీని ఖతం చేసినా ప్రాబ్లెం లేదు. కాని జాతరను నిర్వహించకుండా ఉండకూడదు. ఇదీ కేసీఆర్‌ సిద్ధాంతం.

మేడారం జాతర గురించి తెలంగాణలో తెలియనివారుండరు. రెండేళ్లకోసారి జరుగుతుంది. ఇది సమ్మక్క-సారలమ్మ దేవతలకు సంబంధించిన జాతర. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది గిరిజనులు జాతరకు వస్తారు. ఇది విశ్వాసానికి, సెంటివెంటుకు సంబంధించిన విషయం. ప్రభుత్వం డబ్బులిచ్చినా, ఇవ్వకపోయినా జాతర జరుగుతుంది. అది ప్రభుత్వ కార్యక్రమం కాదు. జాతరలు, ఉత్సవాలు, పండుగలు జరుపుకోవల్సిందే. అవి సజావుగా జరిగేలా ప్రభుత్వం ఖర్చు చేయాల్సిందే. అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిందే. కాని ఓ పక్క ఆర్థిక మాంద్యం అంటూనే, డబ్బుల్లేవని ఆర్టీసీవంటి ప్రజోపయోగ రవాణా సంస్థను ఖతం చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం మేడారం జాతరకు ఇంత భారీగా ఎలా ఖర్చు చేయగలుగుతోంది?

బాలల చలనచిత్రోత్సవానికి అయ్యే ఖర్చెంత? ఆ మొత్తం కూడా ఎందుకు ఖర్చు చేయలేకపోయింది? ప్రజలను సెంటిమెంటుతో కొట్టడమే కేసీఆర్‌కు తెలిసిన ప్రధాన విద్య. సెంటిమెంటుకు ఓట్లు రాలతాయని తెలుసు. కాబట్టి వాటికి ఎట్టి పరిస్థితిలోనూ విఘాతం కలగకుండా చేసుకుంటాడు. జాతరలు, పండుగులు, ఆలయాలు, దేవుడి ఉత్సవాలు…ఇవన్నీ ప్రజల సెంటిమెంటుతో ముడిపడినవి. అందుకే తెలంగాణ సిద్ధించగానే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. బోనాల పండుగను, బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బోనాలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మలు ఆడుతున్నారు. ఆ పది రోజులు మహిళా ఉద్యోగులు అరపూట పనిచేస్తే సరిపోతుంది. బోనమెత్తనివారు, బతుకమ్మలు ఆడనివారు తెలంగాణ వ్యతిరేకులనే భావజాలాన్ని కేసీఆర్‌ తెలంగాణ ప్రజల నరనరాల్లోకి ఎక్కించేశాడు.

వందల కోట్లు ఖర్చు చేసి యాదగిరి గుట్ట (యాదాద్రి) ఆలయం పునర్నిర్మాణం చేయిస్తున్నాడు. రకరకాల హంగులతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్న కేసీఆర్‌ ఆ పనులను తానే పర్యవేక్షిస్తున్నాడు. సమీక్షిస్తున్నాడు. బతుకమ్మ పండుగకు మహిళలకు ఉచితంగా చీరలు ఇస్తున్నారు. ముస్లిములకు, క్రైస్తవులకు వారి పండగలప్పుడు కానుకలు ఇస్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త సచివాలయం కడతానంటున్నాడు. తాను అనుకున్నవాటికి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రికి ఆర్‌టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదా? తాను తలచుకుంటే ఆర్టీసీని బతికించలేడా? కార్మికులు నడిరోడ్లో ఏడవకుండా చేయలేడా? చేయొచ్చు. కాని ఆయనకు ఇదోరకమైన కచ్చ. మొండితనం. పంతం. అంతే….!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close