ఉగాదికి ఇళ్ల పట్టాల పండగ లేదు..!

ఉగాది రోజున పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలనుకున్న ప్రభుత్వ సంకల్పం ఆగిపోయింది. ఇళ్ల స్థలాల పంపిణీని అంగీకరించబోమని.. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో సెంటు చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజునే.. ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ సాధ్యం కాదని తేలిపోయింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన పనులు 29వ తేదీ వరకూ ఉన్నాయి.

ఉగాది 25వ తేదీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. ఇళ్ల పట్టాల పంపిణీ కుదరదు. కౌంటింగ్ ముగిసి.. పాలకవర్గాలు ఏర్పడిన తర్వాతే… కోడ్ ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి… ఎలాగోలా పంచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం.. నిన్నటిదాకా పాత పథకాల విషయంలో.. ఓటర్లపై ప్రభావం చూపుతాయో.. లేదో చూసి.. నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తోంది. ఇప్పుడు… ఇళ్ల స్థలాల పంపిణి వ్యక్తిగత లబ్దిగానే చూస్తున్నామని.. పట్టాల పంపిణీకి అంగీకరించబోమని ప్రకటించేసింది. దీంతో.. ఇప్పటికి కూపన్లను.. అనధికారికంగా పంపిణీ చేస్తున్నారు.

ఇలా ఇళ్ల స్థలాలు పొందిన వారందరికీ.. ఎన్నికలు ముగిసిన తర్వాత … పట్టాల పంపిణ చేస్తామని చెబుతున్నారు. నిజానికి.. పాతిక లక్షల ఇళ్ల స్థలాలను అధికారులు సిద్ధం చేయలేకపోయారు. పెద్ద ఎత్తున స్థలాల కొరత ఉండటం.. అసైన్డ్ ల్యాండ్స్ ను స్వాధీనం చేసుకునే విషయంలో కోర్టుల్లో కేసులు పడటంతో.. ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. వివాదాస్పద భూముల్ని.. లబ్దిదారులకు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పంపిణీలో ఇవన్నీ వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉండటంతో…అధికార పార్టీ కూడా వాయిదా పడితే మంచిదేనని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కోడ్ కూడా కలిసి రావడంతో.. ఇప్పుడు ప్రజలకు చెప్పుకోవడానికి ఓ కారమం దొరుకుతుందని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ప్రభుత్వం మారుతుందని చెప్పకనే చెప్పిన రేవంత్

ఏపీతో సత్సంబంధాలను కోరుకుంటున్నానని.. కొత్త సీఎంతో భేటీ అవుతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతన్నారు. మనవడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా దర్శనం పూర్తయిన తర్వాత మీడియా...

మోడీ మంత్రివర్గంలోకి సన్నీలియోన్…బీజేపీ బిగ్ స్కెచ్ ..!?

బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన ధృవ్ రాథీని నిలువరించేందుకు బీజేపీ బిగ్ స్కెచ్ వేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో వివరిస్తూ ధృవ్ రాథీ చేస్తోన్న...

టిల్లు కోసం క్యూలో మ‌రో ద‌ర్శ‌కుడు

'డీజే టిల్లు'తో స‌డ‌న్ స్టార్ అయిపోయాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. టిల్లు స్క్వేర్ కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఊపేసింది. దాంతో సిద్దు క్రేజ్ మ‌రింత పెరిగింది. దానికి త‌గ్గ‌ట్టే త‌న పారితోషికాన్ని మూడొంత‌లు పెంచేశాడు...

మెగాస్టార్‌లో ఇంత క‌న్‌ఫ్యూజ‌న్ ఏల‌..?!

ఇండ‌స్ట్రీలో పేరున్న ద‌ర్శ‌కులు ఓ 30 మంది ఉంటే.. అందులో స‌గం మంది చిరంజీవితో సినిమా చేస్తున్న‌మ‌న్న ఊహ‌ల్లో ఊరేగుతున్నారు. మారుతి, మోహ‌న్ రాజా, హ‌రీష్ శంక‌ర్‌, అనుదీప్‌, పూరి, త‌మిళ హ‌రి.......

HOT NEWS

css.php
[X] Close
[X] Close