అటకెక్కిన ‘సైజ్ జీరో’ బంగారం పోటీ

అందాల తార అనుష్క శ్రమకూర్చి.. చమటోడ్చి చేసిన సినిమా అనుష్క.. యుద్ధాలు గట్రా చేసిన దాని కన్నా ఈ సినిమాలో అమ్మడు లావెక్కడం పెద్ద సమస్యగా మారింది. పోని ఇంతకష్ట పడ్డా సినిమా ఏమన్నా మంచి ఫలితాన్ని ఇచ్చిందా అంటే అదీ లేదు.. దీని కోసమా స్వీటీ ఇంత కష్టపడ్డది అని అనుకునేలా చేశారు. ఇది దర్శకుడి తప్పిదమా లేక వేరే వాళ్లదా అని పక్కన పెడితే.. సినిమా మొదలైన దగ్గర నుండి విడుదల అయ్యే వరకు ఓ హడావిడి చేసిన చిత్ర యూనిట్ ఫలితం చూశాకా ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యింది.

అయితే సినిమా జనాల్లోకి తీసుకెళ్లానే తాపత్రయంలో సినిమా చూస్తే 1 కెజి బంగారం గెలవొచ్చని పోటీ ఒకటి పెట్టారు సదరు సైజ్ జీరో దర్శక నిర్మాతలు. రిలీజ్ అయిన వారంలో ఈ పోటీ విజేతలను తెలుపుతాం అన్నారు. సినిమానే పోయే సరికి ఇక పోటీని కూడా గాలికొదిలేశారనుకుంటా అందుకే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. టికెట్ కొని సినిమా చూసి ఉచితంగా కెజి బంగారం కొట్టేయొచ్చని అనుకున్న వారందరికి సైజ్ జీరో సినిమా నిరాశే మిగిల్చింది.

ప్రస్తుతానికైతే సైజ్ జీరో బంగారం పోటీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి కార్పోరేట్ స్థాయి నుండి సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చిన పివిపి ఈ విషయాన్ని గమనించి బంగారం పొందిన వారిని ప్రకటిస్తాడా లేక ఇలానే జనాలు మర్చిపోయేదాకా గమ్మునుంటాడా అన్నది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

ఓటేస్తున్నారా ? : క్రిమినల్ ఎప్పుడూ హీరో కాదని గుర్తుంచుకోండి !

" ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదేపెద్ద దొంగ వందలు, వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే.. ఎక్కడా...

పబ్లిక్ డిబేట్… మోడీ భయపడుతున్నారా..!?

అరవై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేశంలో నిజమైన అభివృద్ధి ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆ పార్టీ నేతలంతా ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close