విశ్వ‌క్ సేన్ లేకుండానే ‘హిట్ 2..”?

నాని నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన మ‌రో చిత్రం `హిట్ 2`. రివ్యూలు ఈ సినిమాకి ఏవ‌రేజ్ రేటింగునే ఇచ్చాయి. కాక‌పోతే నిర్మాత‌గా నాని సేఫ్‌. ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లో ఓ ప్రాఫెట్‌బుల్ వెంచ‌ర్‌ని తీయ‌గ‌లిగాడు నాని. ఇప్పుడు హిట్ 2కీ శ్రీ‌కారం చుడుతున్నాడు. అదే ద‌ర్శ‌కుడు, దాదాపు అదే టీమ్ తో `హిట్ 2`జూన్‌లో ప‌ట్టాలెక్క‌బోతోంది. అయితే ఈసారి క‌థానాయ‌కుడు మారే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. విశ్వ‌క్ సేన్ ఈ సీక్వెల్ లో ఉండ‌క‌పోవొచ్చు. ఆ స్థానంలో మ‌రో క‌థానాయ‌కుడ్ని వెదికి ప‌ట్టుకునే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం.

హిట్ 2కి… ప్ర‌ధాన బ‌లం విశ్వ‌క్‌సేన్‌. త‌న అత్యంత స‌హ‌మైన న‌ట‌న‌, ఆ పాత్ర‌లో క‌నిపించిన ఆటిట్యూడ్ ఈ చిత్రాన్ని నిల‌బెట్టాయి. న‌టుడిగా విశ్వ‌క్‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే.. చేసిన పాత్ర‌లో మ‌ళ్లీ క‌నిపించ‌డం విశ్వ‌క్‌కు ఇష్టం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త జోన‌ర్‌నీ, కొత్త క‌థ‌నీ వెదుక్కునే ప‌నిలో ఉంటాడు. అందుకే.. హిట్ 2 అవకాశాన్ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు టాక్‌. నాని కూడా… హిట్ అనే క‌థ‌ని ఫ్రాంజైజీలా చేద్దామ‌నుకుంటున్నాడు. ఒక్కో భాగం ఒక్కో హీరోతో చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ ద‌ర్శ‌కుడు మారినా స‌రే, ఈ ఫ్రాంజైజీ కొన‌సాగించాల‌ని నాని భావిస్తున్నాడ‌ట‌. హిట్ 2 క‌థ విప‌రీతంగా న‌చ్చేసి, ఆ పాత్రలో మ‌ళ్లీ ఓ కొత్త కోణం ఉంద‌ని అనిపిస్తే త‌ప్ప‌.. విశ్వ‌క్ సేన్ ఈ సీక్వెల్‌లో క‌నిపించే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది. మ‌రి ఈసారి విక్ర‌మ్ పాత్ర‌లో క‌నిపించేది ఎవ‌రో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close