క‌న్నీటిప‌ర్యంత‌మైన ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్‌

ప్రీ రిలీజ్ ఫంక్ష‌నంటే.. డాన్సులు, జోకులు.. ఇలా అల్ల‌రి అల్ల‌రిగా హుషారు హుషారుగా సాగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా సాగింది `అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌` ఫంక్ష‌న్‌. ఇటీవ‌లే నంద‌మూరి హ‌రికృష్ణ ఓ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆ విషాదం ఇంకా నంద‌మూరి సోద‌రులు ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ మొహాల్లో క‌నిపిస్తూనే ఉంది. `రం.. రుధిరం.. స‌మ‌రం` అనే పాట వేదిక‌పై ఆల‌పిస్తున్న‌ప్పుడు ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్‌లు చాలా ఎమోష‌న‌ల్‌గా క‌నిపించారు. ఇది చావుకి సంబంధించిన పాట‌. అందుకే తండ్రిని గుర్తు చేసుకుని క‌ళ్ల‌నీళ్లు పెట్టుకున్నారు. ఉబికి వ‌స్తున్న దుఃఖాన్ని ఆపుకోవ‌డానికి ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. కానీ క‌న్నీళ్లు మాత్రం ఆగ‌లేదు. క‌ల్యాణ్ రామ్ స్పీచ్‌లోనూ చాలా ఎమోష‌న‌ల్ అయిపోయాడు. తాత‌య్య‌నీ, నాన్న‌నీ గుర్తు చేసుకుని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. కుటుంబం కంటే వృత్తికి గౌర‌వ‌మిచ్చే కుటుంబం నుంచి వ‌చ్చామ‌ని, అందుకే నాన్న పోయిన 5వ రోజునే ఎన్టీఆర్ షూటింగ్ కి వెళ్లాడ‌ని, అనుకున్న స‌మ‌యంలో ఈ సినిమా విడుద‌ల అవ్వ‌డానికి రాత్రి ప‌గ‌లూ క‌ష్ట‌ప‌డ్డాడ‌ని చెప్పుకొచ్చాడు క‌ల్యాణ్‌రామ్‌. `రం.. రుధిరం.. స‌మ‌రం` పాట‌లోని కొన్ని పంక్తులు పాడి.. ఆ పాట‌లో నాన్న‌ని గుర్తు చేసుకోవ‌డం అభిమానుల గుండెల్ని పిండేసేలా చేసింది. `పెనిమిటీ` పాట‌ని ఆల‌పిస్తున్న‌ప్పుడు కూడా ఎన్టీఆర్ క‌ళ్ల నిండా నీళ్లు క‌నిపించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close