దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్ ఏమైపోయాయి : జగన్ సర్కార్ పై పవన్ ఫైర్

తూర్పుగోదావరి జిల్లాలో పేద బాలిక పై కొందరు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన తెలిసిందే. పదో తరగతి చదువుతకున్న బాలిక తన తల్లికి సహాయపడడానికి వెళుతూ ఉంటే, కొందరు ఆ బాలికను ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

అయితే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన చోటే ఇటువంటి సామాజిక అత్యాచార సంఘటన జరగడం పై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దిశ చట్టం ఏమైపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కనిపించడం లేదని బాలిక తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సరిగా స్పందించలేదని తెలిసిందంటూ, ఇది చాలా బాధాకరం అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృగాళ్లకు కఠినమైన శిక్షలు విధించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సామూహిక అత్యాచారం వెనుక గంజాయి , డ్రగ్స్ ముఠా లు ఉన్నాయని వీటిని కఠినంగా అణచివేయాలని ప్రభుత్వాన్ని కోరారు పవన్ కళ్యాణ్. చట్టం చేయడం తో సరిపోదని దానిని నిబద్ధతతో అమలు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసి వారిపై పోక్సో వంటి కేసులు నమోదు చేశారు.

పొరుగు రాష్ట్రంలో దిశ ఘటన జరిగిన తర్వాత… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష వేసే చట్టాన్ని తీసుకు వచ్చారు. దానికి దశ అని పేరు పెట్టారు. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దిశ యాప్ కూడా రూపొందించారు. అయితే.. ఇవేమీ ఏపీలో… అమ్మాయిపై దారుణాలు అడ్డుకట్ట వేయడానికి సరిపోవడం లేదు. దిశ చట్టం ఇంత వరకూ అమల్లోకి రాలేదు. కఠినమైన చట్టాలున్నా.. వాటిని అమలు చేయకపోవడం వల్లనే సమస్య వస్తోంది. దిశ చట్టం పేరుతో హడావుడి చేశారు కానీ.. చట్టం మాత్రం అమల‌్లోకి రాలేదు. ఇది… ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా.. చర్చకు వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close