ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వాడేశారుగా!

చిరంజీవి హిట్ సాంగ్ ‘చమకు చమకు చామ్..’ రీమిక్స్ ఒక్కటే కాదు, అంతకు మించి మావయ్యల రిఫరెన్సులు ‘ఇంటిలిజెంట్’లో ఉన్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వాడకం మామూలుగా లేదు. తేజు హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘ఇంటిలిజెంట్’. రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ అంతా ఒక ఎత్తు.. చివర్లో వచ్చే పది సెకన్లు మరో ఎత్తు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని మేనల్లుడు ఫుల్లుగా వాడుకున్నాడు. ‘బద్రి’ సినిమాలో ‘ఏ చికీతా…’ పాటలో పవన్ లుక్‌ను తేజు డిటో దించేశాడు. ట్రైలర్ థంబ్ నెయిల్ కూడా అదే పెట్టారు. మధ్యలో ఒకసారి తేజు కనిపించే మార్షల్ ఆర్ట్స్ లుక్ కూడా పవన్ క‌ల్యాణ్‌ని గుర్తుకు తెచ్చేలా ఉంది.

చిరు హిట్ సాంగ్స్ రీమిక్స్ తేజుకు సెంటిమెంట్. అతనికి హిట్ వచ్చి చాలా రోజులైంది. అందువల్ల పెద్ద మావయ్య సాంగ్ రీమిక్స్ చేశాడనుకోవచ్చు. అదొక్కటే చాలదని అనుకున్నాడో ఏమో ఇప్పుడు చిన మావయ్య రెఫరెన్సు కూడా తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదలవుతోంది. ఒక్క రోజు ఆలస్యంగా వస్తున్న వరుణ్ తేజ్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ కూడా పవన్ క‌ల్యాణ్‌దే. ఈ ఇద్దరూ పవన్ క‌ల్యాణ్‌ని వాడుకోవడంలో పోటీ పడుతున్నట్టున్నారు. ఇక, ‘ఇంటిలిజెంట్’ ట్రైలర్ విషయానికి వస్తే వినాయక్ మార్క్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్‌లా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.