విశాఖ ఉక్కు అమ్మకంపై రాజకీయ పార్టీలు సైలెంట్..!

విశాఖ ఉక్కును వంద శాతం అమ్మాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారన్న విషయం బయటకు తెలిసినప్పుడు గగ్గోలు రేగింది. కార్మిక సంఘాలు ఆందోళన ప్రారంభించాయి. వాటికి మద్దతుగా రాజకీయ పార్టీలు రచ్చచేశాయి. టీడీపీ నేతలు ఆమరణదీక్షలు చేశారు. వైసీపీనేతలు పాదయాత్రలు చేశారు. ఎక్కడ కార్మికులు ఉంటే అక్కడకు వెళ్లి.. స్టీల్ ప్లాంట్‌ను అమ్మనీయబోం అని ప్రకటించి వచ్చారు. తర్వాత ఢిల్లీలో విజయసాయిరెడ్డి కూడా అదే ప్రకటనలు చేశారు. కానీ.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం అమ్మకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తూ వస్తోంది. అంత హడావుడి అప్పట్లో జరగడానికి కారణం.. గ్రేటర్ విశాఖ ఎన్నికలు. ఇప్పుడాఎన్నికలు ముగిశాయి. దీంతో ఉద్యమం నుంచి రాజకీయ పార్టీలు కూడా సైలెంటయిపోయాయి.

తాజాగా కేంద్రం విశాఖ ఉక్కు అమ్మకంపై మరో అడుగు ముందుకేసింది. లీగల్ అడ్వయిజర్, ట్రాన్సాక్షన్‌ అడ్వయిజర్‌ నియామకానికి బిడ్లు ఆహ్వానించింది. ఈ నెలాఖరులో వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అధికారికంగా అమ్మకం ప్రక్రియ ప్రారంభిస్తారు. విక్రయ ప్రక్రియలో న్యాయసలహాదారు, లావాదేవీ సలహాదారుల నియామకం అత్యంత కీలకం. వారిచ్చే సిఫార్సుల ఆధారంగా తదుపరి నిర్ణయాలు జరుగుతాయి. అంటే…అధికారికంగా అమ్మకం ప్రక్రియలో మొదటి అడుగు పడినట్లే. ఇంత కీలకమైన ప్రక్రియ ప్రారంభమైనా..రాజకీయ పార్టీల్లో కనీస చలనం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ అసలు తమకేం సంబంధం లేనట్లుగా ఉంటోంది.

వైసీపీ ఎపీలు ముఫ్పై మంది వరకూ ఉన్నారు. వారెవరూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి చెప్పడంలేదు. టీడీపీ నేతలు… కార్మికుల వద్దకు వెళ్లి అండగా ఉంటామని చెబుతున్నారు తప్ప.. అంతకు మించి వారు చేసేదేం లేదు. ఇప్పుడు మీడియా కూడా..కార్మికుల ఉద్యమాల గురించి లైట్ తీసుకుంది. పెద్దగా ప్రచారం కల్పించడం లేదు. దీంతో కార్మికుల ఆవేదనలు… ఆవేదనలుగానే ఉండిపోతున్నాయి. ఇదంతా.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేసుకున్న స్వయంకృతమేనన్న ప్రచారం కూడా ఉంది. వైసీపీ పెద్దలతో ఎక్కువగా టచ్‌లో ఉండి.. వారుచెప్పినట్లుగా చేయడం వల్ల… చివరికి ఇతరుల మద్దతు లేకుండా చేసుకున్నారన్న విమర్శలు కార్మిక నేతలపై వస్తున్నాయి. ఇప్పుడు.. ఏం చేసినా.. విశాఖ ఉక్కును అమ్మకుండా చేయడం సాధ్యం కాదన్న వాదనను ఎక్కువ మంది వినిపిస్తూ లైట్ తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close