పోసాని వైసీపీకి అద్దె మైకా..?

టాలీవుడ్‌లో ఒకప్పుడు రచయితగా..ఇప్పుడు నటుడుగా నిలబడిన.. పోసాని కృష్ణమురళి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందూ వెనుకా చూడకుండా సపోర్ట్ చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున చిలుకలూరిపేటలో పోటీ చేసి… డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిన పోసాని.. ఆ తరవాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. తాను ఇక ఏ పార్టీలోనూ చేరబోనని చెప్పారు. చేరలేదు కూడా. కానీ ఇప్పుడు వైసీపీకి మాత్రం… పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నారు. అభిమానం ఉంటే.. మద్దతిచ్చే పార్టీని పొగుడుకోవచ్చు కానీ.. పోసాని మాత్రం చంద్రబాబును వ్యక్తిగతంగా తిడుతూ… జగన్‌కు ఆనందం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో అదే చేశారు.ఇవాళ కూడా అదే చేశారు. కొద్ది రోజుల క్రితం.. ప్రత్యేకంగా వెళ్లి పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ తో సమావేశమై… ఆయన కోసం వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి.. ఆ తర్వాత ఆయన సరిగ్గా పని చేయకపతే.. తన ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టాలని ఆఫర్ కూడా ఇచ్చారు.

ఇప్పుడు మళ్లీ జగన్ కోసం బ్యాటింగ్ ప్రారంభించారు. జగన్ మీడియా సహకారంతో ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిన పోసాని.. కృష్ణమురళి.. చంద్రబాబుపై వ్యక్తిగతమైన విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్ కాళ్లు పట్టుకుని అమరావతి పారిపోయారని నోరు చేసుకున్నారు. రాజకీయ అవసరం కోసం ఎవరి కాళ్లు అయినా పట్టుకునే చంద్రబాబు వగలాడి అని పోసాని మండిపడ్డారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి తెచ్చుకోనన్ని స్టేలను చంద్రబాబు తెచ్చుకున్నారని సాక్షి పేపర్లో రాసే మాటలను చెప్పుకొచ్చారు. అదే సమయంలో జగన్ పై వచ్చిన ఆరోపణలు మాత్రం ఖండించేశారు. జగన్ అసలు అవినీతే చేయలేదని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అనుభవం లేదన్న విమర్శలకూ .. ఆయనే కౌంటర్ ఇచ్చేశారు. ఆయనకు అనుభవం అక్కర్లేదని సర్టిఫికెట్ జారీ చేశారు.

పోసాని కృష్ణమురళి కొన్నాళ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు రాజకీయ ఆకాంక్షలు ఉంటే ఆ పార్టీలో నేరుగా చేరిపోయి విమర్శలు చేయవచ్చు. కానీ ఆయన పార్టీలో చేరలేదని చెప్పుకుంటూ చంద్రబాబుపై వ్యక్తిగతంగా విరుచుకుపడుతున్నారు. పోసాని డొంక తిరుగుడు రాజకీయాలెందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. నేరుగా ఆ పార్టీలో చేరి మాట్లాడితే.. అధికార ప్రతినిధి ఏమో అనుకుంటారు. కానీ ఆ పార్టీలో లేను అంటూ… ఇలా అడ్డగోలుగా.. జగన్ పై అభిమానం చూపిస్తూ.. చంద్రబాబును తిట్టుకుంటూ ఉంటే… అద్దె మైక్ అనే అనుకుంటారు. ప్రస్తుతానికి పోసాని స్టేటస్ ఇదే అనుకుంటున్నారు.. అటీ రాజకీయ..ఇటు సినీ జనాలు కూడా..‍‍‍!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close